వచన కవిత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం. [[ఆంగ్లం]]లోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా '''వచన కవిత''' అన్న పదం ప్రయోగింపబడుతోంది. పద్యం గేయంగా మారి, గేయం వచన ధోరణిలోకి మారిన పరిణామ దశలను గమనిస్తే [[తెలుగు కవిత్వం|తెలుగు కవిత్వ]] ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి [[పద్యం|పద్యమే]] దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రొయోగమే వచన కవిత.
 
 
[[కుందుర్తి ఆంజనేయులు]] వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. [[నగరంలోవాన]] కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్య]] లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో తెలుగు సాహిత్య లోకం హోరెత్తింది. [[వచనం]] లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.
 
==వచన కవితా లక్షణాలు:==
పంక్తి 12:
* చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత, భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
* ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
* చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.
 
 
పంక్తి 22:
</poem> ---- ఇందులోని భావం ఎంత తీవ్రంగా చెప్పబడిందో వివరించనక్కరలేదు.
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచనకవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు [[పద్యం]] రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.
 
 
"https://te.wikipedia.org/wiki/వచన_కవిత" నుండి వెలికితీశారు