విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 17:
 
===మాధ్యమిక విద్య===
సమకాలీన విద్యావిధానంలో, [[సెకండరీ విద్య]] , లేక [[మాధ్యమిక విద్య]] చాలా ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను [[బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్]] మరియు [[ఇంటర్మీడియట్ విద్యా మండలి]]వారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు [[జిల్లా పరిషత్]], [[మండల పరిషత్]], [[మునిసిపల్ కార్పొరేషన్]], మరియు [[పురపాలక సంఘం]], కలుగజేస్తాయి. జిల్లాలో [[విద్యాశాఖ]], [[జిల్లా విద్యాశాఖాధికారి]] ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ భోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. ఈ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి, [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] పరీక్షలు.
 
=== ఉన్నత విద్య ===
పంక్తి 23:
[[దస్త్రం:ClareCollegeAndKingsChapel.jpg|right|thumb|[[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]] ఒక ఉన్నత విద్యాకేంద్రం.]]
 
ఉన్నత విద్య [[ఉన్నత పాఠశాల]] విద్య తరువాత ప్రారంభమౌతుంది. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీని గ్రాడ్యుయేషన్ అని, దాని తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డీ. డిగ్రీలు కలవు. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.
 
ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, [[కళ]]లు, [[భౌతికశాస్త్రం]], [[రసాయనిక శాస్త్రం]], [[జీవశాస్త్రం]], [[గణితం]], [[వాణిజ్యం]], [[బోధన]], [[సామాజిక శాస్త్రం]], [[మానసిక శాస్త్రం]], [[ఫిలాసఫీ]], [[భాషలు]], [[కంప్యూటర్ శాస్త్రం]], [[ఆర్థిక శాస్త్రం]], [[వైద్య శాస్త్రం]], [[న్యాయశాస్త్రం]], [[ఇంజినీరింగ్]] మరియు ఇతర రంగాలు.
పంక్తి 42:
=== ప్రత్యామ్నాయ విద్య ===
 
[[ప్రత్యామ్నాయ విద్య]] అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం, [[పాఠశాలనుండి వైదొలగేవారిని]] తగ్గించడం. దీనికొరకు [[సార్వత్రిక పాఠశాల]] (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.
 
== బోధనాంశాలు ==
పంక్తి 55:
ఈ అభ్యసనా పద్దతులన్నీ [[విద్యార్థి|విద్యార్థులకు]] అవసరం. <ref>[http://www.learningstyles.net/ Dunn and Dunn]</ref> <ref>[http://www.indiana.edu/~intell/renzulli.shtml Biographer of Renzulli]</ref> వీటికి ఉదాహరణ:
 
* [[కదలిక ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
* [[దృశ్య ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి వీక్షించి, గమనించి, ఏమి జరుగుతున్నది?, ఎలా జరుగుతున్నది?, ఎందుకు జరుగుతున్నది?, ఎప్పుడు జరుగుతున్నది? మున్నగు ప్రశ్నలు వేసుకొని నేర్చుకుంటాడు.
* [[శ్రవణ ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి విని, విషయసంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు.
 
=== [[బోధన]] ===
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు