విష్ణువు వేయి నామములు-401-500: కూర్పుల మధ్య తేడాలు

+{{వికీబుక్స్‍కు తరలింపు}}
చి Wikipedia python library
పంక్తి 4:
[[విష్ణు సహస్రనామ స్తోత్రము]]లోని వేయి నామాలలో 401 నుండి 500 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. [[అద్వైతం|అద్వైత సిద్ధాంతము]] ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో [[పరాశర భట్టు]] రచించిన భాష్యము [[భగవద్గుణ దర్పణము]] అనే గ్రంధం [[విశిష్టాద్వైతం]] సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
 
 
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.
 
కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.<br />
పంక్తి 13:
==విష్ణువు సహస్ర నామములు - 401-500==
 
401) వీర: - పరాక్రమశాలియైనవాడు.
 
402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
 
403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.
 
404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
 
405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.
 
406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.
 
407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.
 
408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.
 
409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.
 
410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.
 
411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.
 
412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.
 
413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
 
414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.
 
415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.
 
416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.
 
417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
 
418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.
 
419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.
 
420) పరిగ్రహ: - గ్రహించువాడు.
 
421) ఉగ్ర: - ఉగ్రరూపధారి
 
422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.
 
423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.
 
424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.
 
425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.
 
426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.
 
427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
 
428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
 
429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.
 
430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.
 
431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
 
432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.
 
433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
 
434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
 
435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.
 
436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.
 
437) అభూ: - పుట్టుక లేనివాడు.
 
438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.
 
439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.
 
440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.
 
441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.
 
442) క్షమ: - సహనశీలుడు.
 
443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.
 
444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.
 
445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
 
446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.
 
447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.
 
448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.
 
449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.
 
450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.
 
451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.
 
452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.
 
453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
 
454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.
 
455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.
 
456) సుముఖ: - ప్రసన్న వదనుడు.
 
457) సూక్ష్మ: - సర్వవ్యాపి.
 
458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.
 
459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.
 
460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.
 
461) మనోహర: - మనస్సులను హరించువాడు.
 
462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.
 
463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.
 
464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.
 
465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
 
466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.
 
467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
 
468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.
 
469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
 
470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.
 
471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.
 
472) వత్సీ - తండ్రి వంటివాడు.
 
473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.
 
474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.
 
475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.
 
476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.
 
477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.
 
478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.
 
479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.
 
480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.
 
481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.
 
482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.
 
483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.
 
484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.
 
485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.
 
486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.
 
487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.
 
488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.
 
489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.
 
490) ఆదిదేవ: - తొలి దేవుడు.
 
491) మహాదేవ: - గొప్ప దేవుడు.
 
492) దేవేశ: - దేవదేవుడు.
 
493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.
 
494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.
 
495) గోపతి: - గోవులను పాలించువాడు.
 
496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.
 
497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.
 
498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.
 
499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.
 
500) భోక్తా - అనుభవించువాడు.