విస్కాంసిన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవాలయాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 3:
 
 
'''విస్కాంసిన్ హిందూ దేవాలయం''' మే [[2001]] వ సంవత్సరంలో [[విస్కాంసిన్]] లో మొట్టమొదటి హిందూ [[దేవాలయం]]గా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత గణపతి, శివ పార్వతులు, రాధా కృష్ణులు, హనుమాన్ సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, దుర్గాదేవి , సత్యనారయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్టించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిశష్ఠించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారత దేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
==నిర్మాణం==
 
జాతీయ రహదారి I - 94 పక్కగా 21.5 ఎకరాల కొండ ప్రాంతంలో ఈ గుడిని నిర్మించారు. దీనికి డిజైనర్ అర్కిటెక్ట్ గా సుహాస్ ఆర్ పవార్. గుడి తూర్పు ముఖంగా ఉంది. 125 అడుగుల పొడవు 90 అడుగుల వెడల్పు కలిగి రెండు అంతస్తులలో కలిపి 24,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంది. కింది భాగంలో దేవాలయపు కాంటీన్ మరియూ సంస్కృతిక కార్యక్రమాల కొరకు ఒక stage ఉన్నాయి. ఇక్కడ ప్రతి [[దీపావళి]]కి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
 
==బయటి లంకెలు==