వీరముష్టి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''వీరముష్టి''' : బీ.సి.ఏ.గ్రూపు [[కులం]].[[నెత్తికోతల]] , [[వీరభద్రులు]] గా కూడా పిలుస్తారు.వీరముష్టి కులస్తులు కేవలం తమ కులం పేరు కారణంగా చిన్నచూపుకు గురవుతున్నా మనే కారణంగా రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘[[వీర భద్రీయులు]] ’గా మార్పు చేయించుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కూడా వీర భద్రీయులుగానే బీసీ జాబితాలో పేరు చేర్చింది.
 
==జీవన సరళి==
పంక్తి 5:
 
==సామాజిక జీవితం==
[[విభూది]] తయారు చేస్తారు కనుక వీరిని [[విభూదులవారు]] అని కూడా పిలుస్తారు. రాష్ర్ట వ్యాప్తంగా 20 లక్షల జనాభా ఉంటారు. పిడిగుద్దులతో ప్రత్యర్థులను మట్టికరి పించే సమర్ధత కలిగినందున వీరిని వీరముష్ఠి ([[ముష్టి]] అనగా [[పిడికిలి]])వారుగా పేరొందారు. ఇప్పటికీ పిడికిలితో కొట్టి కొబ్బరి కాయలను పగులగొట్టగల సత్తాను వీరు ప్రదర్శిస్తుంటారు. కాలగమనంలో అపభ్రంశానికి గురైన పదాల్లో వీర ముష్ఠి కూడా ఒకటి. సమాజం వీరిని `వీర ముష్టి' వాళ్లుగా కించపరచడంతో ఈ కులంలో పుట్టిన విద్యావంతులు సైతం తమ కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో వీరిని శివుడి ముఖ్యసేవకుడు [[వీరభద్రుడు|వీరభద్రుడి]] వారసులుగా వీరిని పరిగణించేవారు. తెలుగునేలను పాలించిన వివిధ సామ్రాజ్యాల్లో వీరు సైనికులుగా ప్రధాన భూమిక పోషించారు. అప్పట్లో వైశ్యుల ఆస్తుల రక్షణ బాధ్యతలు వీరిపైనే ఉండేవి. అందువల్లే ఇప్పటి తరం వైశ్యుల దగ్గర అడుక్కుం టారు. [[వైశ్యులు]] దగ్గర తప్ప మరెక్కడా వీరు చేయి చాపరు. అయితే తాము అడుక్కోవడం లేదంటారు వీరభద్రీయులు. రాజరికంలో రక్షణ వ్యవస్థగా ఉన్న తమకు అందింది జీతమో, పారితోషకమో తప్ప దయాభిక్ష కాదంటారు. రెండు దశాబ్దాల క్రితమే ఈ కుల పెద్దలు తమ కులం పేరును `వీరభద్రీయులు'గా మార్పు చేయించుకున్నారు. కాగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీరముష్టి పేరిట వీరి కుల ధృవీకరణ పత్రాలను అధికారులు మంజూరు చేస్తున్నారు. వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ప్రభలు కట్టి అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/వీరముష్టి" నుండి వెలికితీశారు