వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 10:
==మామిడి చెట్టు==
లాటిన్ పేరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్డియేసీ.సంస్కృతంలో ఆమ్ర అంటారు. ఇది దక్షిణాసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది.
మామిడి చాలా ప్రసిద్ధి చెందిన రుచికరమైన ఫలము.మామిడి చాలా రకాలుగా దొరుకుతుంది,చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా.bæsj
 
==వేప చెట్టు==
లాటిన్ పేరు-అజాడిరక్టా ఇండికా.కుటుంబం-మీలియేసీ.సంస్కృతంలో నింబ అంటారు. ఇది దక్షిణ ఆసియా దేశాలైన ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మియన్మార్ ప్రాంతాలలో కనిపిస్తుంది.
వేప చాలా ఔషధ విలువలు కలిగిన చెట్టు. దీని విత్తనాలు, ఆకులు, కాండము, వేర్లు,బెరడు మొదలైన భాగాలన్నీఔషధాలుగా ఉపయోపడుతాయి. చాలా రకాలయిన వ్యాధులను వేప ఆకులను లేదా విత్తనాలను ఉపయోగించి నయం చేయవచ్చును. ఇవి అన్నీ చేదు రుచిని కలిగి ఉంటాయి.
 
==రావి చెట్టు==
పంక్తి 25:
 
==కొబ్బరి చెట్టు==
కొబ్బరి చెట్టు లాటిన్ పేరు కోకస్ న్యుసిఫెరా. తెలుగులో నారికేళం, టెంకాయ, కొబ్బరి అంటారు.
కొబ్బరి చెట్టు కాండం గుండ్రంగా పొడవుగా పెరుగుతుంది కాండానికి పెద్ద ఆకులు మధ్యలో ఈనె కలిగి ముదురాకు పచ్చ రంగు లో ఉంటాయి. పూలు ఎరుపు, పసుపు రంగు కలిగి కాండానికి పూస్తాయి.
 
కాయలు పెద్దవిగా మూడుముఖాలతో ఉంటాయి, మొదట ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు బూడిద రంగు లోకి మారతాయి. కాయ లోపల గట్టి టెంక దాని చుట్టూ పీచు ఉంటుంది, టెంక లోపల తెల్లటి కొబ్బరి,నీళ్ళూ ఉంటాయి. కొబ్బరి కాయ లోని నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి మంచి పౌష్టికాహారం ప్రొటీన్లను కలిగిఉంటుంది.
 
దీని కాండం లో చిన్న పాటి పడవడలు తయారుచేస్తారు, ఆకులు ఇంటి పైకప్పుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఆకు ఈనెలతో చీపుళ్ళు తయారు చేస్తారు. కొబ్బరి పీచు తో తాళ్ళు, తివాచీలు తయారు చేస్తారు. టెంకను వంట చెరకుగా ఉపయోగిస్తారు. టెంక లోపలి కొబ్బరి తో నూనె తయారు చేస్తారు,పచ్చి కొబ్బరితో కూరలూ, పచ్చళ్ళు చేసుకుంటారు.
 
[[బొమ్మ:Rk 003.jpg|thumb|right|300px|తాటి చెట్టు-కాయలతో]]
పంక్తి 43:
 
==రేగు చెట్టు==
రేగు చెట్టు లాటిన్ పేరు జిజిఫస్ జుజూబా. చిన్న పొదలు గానూ పెద్ద వృక్షం గానూ ఉంటుంది. మెట్ట ప్రాంతం లోనూ బంజరు భూములలోనూ పెరుగుతుంది. ఇది నిత్య హరిత వృక్షము దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు బారి మందంగా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదలు లో ముళ్ళు కలిగి ఉంటుంది, ఆకులు గుండ్రంగా క్రిందవైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
రేగు పూలు గుత్తులుగా ఆకుపచ్చ మరియూ పసుపుపచ్చ రంగులుగా చిన్న నక్షత్రాల వలె ఉంటాయి. పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోను క్రమంగా పసుపురంగులోకి మారి పండుగా మారినపుడు ఎరుపు రంగులో ఉంటాయి. పండు తొక్క మందంగా ఉంటుంది లోపల గుజ్జు కలిగి మధ్యలో గట్టి గింజ కలిగి ఉంటుంది, పులుపుగానూ తియ్యగానూ ఉంటాయి.
దీని కలపను వంటచెరకు గా ఉపయోగిస్తారు. పండ్లు తినడానికి, వడియాలు, పచ్చళ్ళు పెట్టడానికీ ఉపయోగిస్తారు.
 
==పనస చెట్టు==
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు