వెంపటి సదాశివబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox writer
| name = వెంపటి సదాశివబ్రహ్మం
| image =
| imagesize =
| alt =
| caption =
| pseudonym =
| birth_name =
| birth_date = 1905, ఫిబ్రవరి 19
| birth_place = తూర్పు గోదావరి జిల్లా
| death_date = 1968, జనవరి 1
| death_place = [[మద్రాసు]]
| occupation = రచయిత
| nationality = భారతీయుడు
| ethnicity = [[హిందూ]]
| citizenship = భారతీయులు
| education =
| alma_mater =
| period =
| genre = కథారచయిత
| subject =
| movement =
| notableworks =
| spouse =
| partner =
| children =
| relatives =
| influences =
| influenced =
| awards =
| signature =
| signature_alt =
| website =
| portaldisp =
}}
'''వెంపటి సదాశివబ్రహ్మం''' (1905 - 1968) పేరుపొందిన చలనచిత్ర రచయిత.
పంక్తి 44:
దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి, సదాశివబ్రహ్మం హరికథను విని, వెంటనే తను నిర్మించే 'తెనాలిరామకృష్ణ' (1941) చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించాడు. 1941 వరకే దాదాపు 75 చిత్రాలు విడుదలై 'చిత్రవజ్రోత్సవాన్ని' చేసుకొన్న తెలుగు సినిమాలో వెంపటి ప్రవేశంతో స్క్రీన్‌ ప్లే విధానంలో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరచే విధంగా సంభాషణలు వ్రాయడంలో కొత్త ఒరవడిని వెంపటి సదాశివబ్రహ్మం సృష్టించారు. అలా తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించిన వెంపటి అనంతర కాలంలో దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ ఎన్నో సినిమాలకు రచనలు చేశారు.<ref>[http://www.prabhanews.com/insidestory/article-112456 సినీగీత సుమసౌరభం - ఆంధ్రప్రభ మే 23, 2010]</ref>
 
1941 లోనే రాజాశాండో దర్శకత్వం వహించిన 'చూడామణి' చిత్రానికి వెంపటి స్క్రీన్‌ ప్లే సమకూర్చాడు. 1941 లో వచ్చినా 1950 దశకంలో రాబోతున్న సినిమాల తాలూకు ఛాయలన్నీ ఆ సినిమాలో పొడచూపాయి. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను వదిలిపెట్టి 'చూడామణి' కొత్త పుంతల్ని తొక్కింది. హాస్యనటి, గాయని టి. కనకం, వెంపటి తో కలిసి 'దేశదిమ్మరి' అనే చిత్రాన్ని ప్రారంభించింది. కాని చిత్రం తొలిదశలోనే ఆగిపోయింది. ఈ సినిమా కోసం రాసిన కథే 1957 లో ''స్వయంప్రభ'' గా అవతరించింది. 1942 లో రోహిణి బ్యానర్‌ కింద హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన 'ఘరానా దొంగ' (హానెస్ట్‌ రోగ్‌) చిత్రానికి వెంపటి సంభాషణలు, పాటలు అందించాడు.
 
1943 నుంచి 1945 వరకు, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్రనిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్‌పార్కు వద్ద ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటి, చేతినిండా సినీరచనలు లేక మళ్లీ అవధానాలు, హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగాడు. ఈ కాలంలో వెలువడిన చిత్రాలకు 'ఘోస్టురైటర్‌'గా కూడా పని చేశాడు. గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన 'పల్నాటి యుద్ధం' (1947) చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసింది వెంపటే (టైటిల్స్‌లో పేరు కనిపించదు) అలాగే కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన ''రాధిక (1948) సువర్ణమాల చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు.