షెల్లు ఖాతా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీప్రాజెక్టు లినక్సు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
 
షెల్లు ఖాతా (Shell Account) ఒక వ్యక్తిగత ఖాతా. ఈ ఖాతాను ఉపయోగించికుని మీరు, [[యునీక్సు]]/[[లినక్సు]] [[ఆపరేటింగు సిస్టము]] మీద నడుస్తున్న ఇతర [[కంప్యూటరు|కంప్యూటర్ల]]ను మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. అలా వేరే కంప్యూటర్లలోకి ''లాగిన్''అయ్యి, అక్కడ ఆదేశాలు(commands) జారీచేసి మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. ఇతర కంప్యూటర్లు బౌగోలికంగా మీకు అందుబాటులో లేకపోయినా కూడా, షెల్లు ఖాతా ఉపయోగించి, ఆ కంప్యూటర్లతో మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. సాధారణంగా షెల్లు ఖాతా ఉపయోగించుకోవడానికి [[టెల్నెట్]] లేదా [[ఎస్.ఎస్.హెచ్]] లాంటి ప్రోగ్రాములను వాడతారు.
 
ఆధునిక వెబ్సైటును నడపాలనుకున్నప్పుడు, షెల్లు ఖాతా ఎంతో ఉపయోగ పడుతుంది. ఆధునిక వెబ్సైటును సమర్పించే కంప్యూటర్లలో చాలా విలువైన సమాచారం ఉంటుంది, అందుకని సాధారణంగా ఆ కంప్యూటరుని, అత్యంత భద్రమైన ప్రదేశంలో ఉంచుతారు. అ తరువాత ఆ కంప్యూటరుని ముట్టుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఇలాంటి సందర్భాలలో షెల్లు ఖాతాలను సృష్టించి, ఆ షెల్లు ఖాతాలనుండి వెబ్సైటుకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. వెబ్సైటు మాత్రమే కాదు, [[ఐ.ఆర్.సీ]], [[ఈమెయిలు]] లాంటి ఆధునిక కార్యక్రమాలను నడుపుతున్న కంప్యూటర్లను కూడా షెల్లు ఖాతాలతో నియంత్రించవచ్చు. అంతేకాదు మీరు ఇతర [[ఆపరేటింగు సిస్టము]]లు ఎలా పనిచేస్తున్నాయో చూడాలనుకున్నప్పుడు కూడా షెల్లు ఖాతా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాక షెల్లు ఖాతా ఉపయోగించి [[వికీపీడియా:Bot|బాట్ల]] ద్వారా ఇతర కంప్యూటర్లలో యాంత్రికమైన పనులు కూడా నిర్వహించవచ్చు.
 
షెల్లు ఖాతాలను చాలాసార్లు దుర్వినియోగపరుస్తూ ఉంటారు. ఆలా దుర్వునియోగ పరచటం వలన ముఖ్యమయిన సమాచారం నాశనమైపోవచ్చు లేదా కంప్యూటరే చెడిపోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ అరికట్టటానికి వాటి నిర్వాహకులు షెల్లు ఖాతాలపై ఎన్నో నిబంధనలు, ఆంక్షలు విధిస్తారు. వాటిలో మొదటిది అదృశ్యరూపంలో ప్రోగ్రాములను (background processes) నడపనివ్వకపోవటం. తరువాత ఒకేసారి ఎంతమంది షెల్లు ఖాతాల ద్వారా లాగిన్ అవ్వొచ్చనే దానిపైన కూడా నిబంధన విధిస్తారు. అంతేకాదు షెల్లు ఖాతాల ద్వారా ఏఏ పనులు నిర్వర్తించవచ్చు అనే దానిపై కూడా నియమనిబంధనలు విధిస్తారు.
 
====సామూహిక సంస్థలు / ప్రొవైడర్ల సమూహాలు / షెల్లు ఖాతా ప్రొవైడర్ల జాబితా ====
"https://te.wikipedia.org/wiki/షెల్లు_ఖాతా" నుండి వెలికితీశారు