సంపాతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
 
పంక్తి 3:
 
[[File:Sampati's Find.jpg|thumb|సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి]]
[[రామాయణం]]లో '''సంపాతి''' ఒక గ్రద్ద పాత్ర. ఇతను [[జటాయువు]]కు అన్న. వీరి తల్లి [[శ్యేని]], తండ్రి [[అనూరుడు]]. ఒకసారి సోదరులు ఇద్దరూ సూర్యమండలం వద్దకు ఎవరు త్వరగా చేరుకొంటారు అని పోటీగా ఎగిరినప్పుడు జటాయువు త్వరగా సూర్యమండలం వైపు వెళ్ళుతుంటే జటాయువు రెక్కలు కాలిపోయే సమయంలో సంపాతి తన రెక్కలు అడ్డు పెట్టాడు. అలా సంపాతి రెక్కలు కాలిపోయాయి. ఆవిధంగా రెక్కలు కాల్చుకొని అతను దక్షిణతీరం లొని మహేంద్రగిరి వద్ద పడి ఉంటాడు.
 
 
[[సీత|సీతాన్వేషణలో]] ఉన్న [[హనుమంతుడు]] మెదలైన వానర బృందం నిరాశులై ప్రాయోపవేశానికి సిద్ధపడ్డారు. వారు మాటల మధ్యలో జటాయువు మరణించిన సంగతి అనుకొంటుండగా సంపాతి ఆ మాటలు విన్నాడు. తన తమ్ముని మరణ వార్త విని దుఃఖించాడు. సీత [[రావణుడు|రావణాసురుని]] చెరలో జీవించే ఉన్నదని అంగద హనుమ జాంబవంతాదులకు చెప్పాడు. గరుడుని వంశానికి చెందినవారమైనందున తాము చాలా దూరం చూడగలమని, లంకలో సీత భయవిహ్వలయై ఎదురుచూస్తున్నదని చెప్పాడు. వారికి జయం కలగాలని ఆశీర్వదించాడు. తన తమ్మునికి తర్పణం వదిలాడు. ఈ కథ [[వాల్మీకి]] రామాయణం [[కిష్కింధ కాండము]] చివరి సర్గలలో వస్తుంది.
 
[[సుపార్శ్వుడు]], [[బభ్రువు]], [[శీఘ్రుడు]] ఇతని సంతానం. [[మధ్యప్రదేశ్]] [[సత్నా జిల్లా]]లోని "గృధరాజ పర్వతం" సంపాతి జన్మస్థనమని స్థలపురాణం<!-- <ref>Skanda Purana (page 208)</ref> -->
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సంపాతి" నుండి వెలికితీశారు