సపోటా: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రమాలిక: చిత్రం చేర్చితిని.
చి Wikipedia python library
పంక్తి 22:
'''సపోటా''' (''Sapodilla'' - ''Manilkara zapota''), ఒక [[సతత హరితం|సతత హరితమైన]] [[చెట్టు]]. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. [[భారత ఉపఖండం]], [[మెక్సికో]] ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను [[పండు|పండ్ల]]కోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు [[ఫిలిప్పీన్స్]]‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.
 
సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy [[:en:latex|latex]] called [[:en:chicle|chicle]].) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు [[గింజ]]లు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో [[:en:saponin|సపోనిన్]] అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది [[:en:tannin|tannin]] లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.
 
సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. [[పూవు]]లు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. ఇదివరకు సపోటా (Sapodilla)ను ''Achras sapota'' అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (''sawo'') అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో ''hồng xiêm'' (''xa pô chê'') అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో ''లమూత్'' (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో ''níspero'' అని, క్యూబా వంటి చోట్ల ''nípero'' అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..
==రకాలు : ==
మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.
"https://te.wikipedia.org/wiki/సపోటా" నుండి వెలికితీశారు