సహదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q2044641 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
'''సహదేవుడు''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొ [[పాండవులు|పాండవులలో]] ఐదవవాడు. [[అశ్వనీ దేవతలు|అశ్వనీదేవతల]] అంశ. [[పాండు రాజు]] శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి [[మాద్రి]] [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]]చే నకుల సహదేవులను కన్నది.
 
 
పాండవులు ఐదుగురూ [[ద్రౌపది]]ని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం [[ఉపపాండవులు|ఉపపాండవులలో]] శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)
 
 
ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన [[శకుని]]ని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. [[కురుక్షేత్ర యుద్ధం]]లో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/సహదేవుడు" నుండి వెలికితీశారు