సాయంకాలమైంది: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Sayamkalamaindi.jpg|250px|right|thumb|నవల ముఖచిత్రం]]
[[సాయంకాలమైంది]] [[గొల్లపూడి మారుతీరావు]] రాసిన ఒక నవల. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది.
==నేపధ్యం==
ఈ నవల నేపథ్యమైన శ్రీవైష్ణవం గురించి గొల్లపూడి మారుతీరావు శ్రీ భాష్యం అప్పలాచార్యుల నుంచీ, శ్రీ సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల నుంచీ సేకరించారు. ఈ నవలను రాయడానికి, ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురించడానికి సహాయపడింది వల్లూరు రాఘవ రావు.
==కథ==
పద్మనాభం అనే ఊర్లోని పరమ నైష్ఠిక వైష్ణవ బ్రాహ్మణుల ఇంట జన్మించిన చిన తిరుమలాచార్యుల చుట్టూ కథ పరిభ్రమిస్తూ ఉంటుంది. అతని తల్లిదండ్రులు సుభద్రాచార్యులు, వరదమ్మ. అదే ఊళ్ళోని కుంతీనాథ స్వామిని ఆరాధిస్తూ జీవనం సాగిస్తుంటారు. మొదట్లో తండ్రి అడుగు జాడల్లోనే అర్చకత్వం నేర్చుకుంటున్న చిన తిరుమలాచార్యుల ప్రతిభను గుర్తించిన వెంకటాచలం అతనికి ఆంగ్లవిద్య మీద ఆసక్తిని కలిగిస్తాడు. సుభద్రాచార్యులు మొదట్లో ఇందుకు అంగీకరించలేకపోయినా కొడుకు ఆసక్తిని గమనించి, వరదమ్మ, వెంకటాచలం, తదితరుల ప్రోద్భలంతో అందుకు అంగీకరిస్తాడు. చిన తిరుమలాచార్యులు నెమ్మదిగా పాఠశాల విద్య దాటి కళాశాలకు చేరుకుంటాడు. అక్కడి తన ప్రతిభకు ముగ్ధుడైన ఆచార్యులు అమెరికాలోని జెనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు ఈ ప్రతిభను చేరవేస్తారు. చదువు పూర్తి కాగానే అమెరికాలో ఉద్యోగం వస్తుంది. అలా చిన తిరుమలాచార్యుల అందరినీ వదిలి అమెరికాకు ప్రయాణవుతాడు. ఇక్కడ తల్లిదండ్రులకు కుమారుడి మీద బెంగ మొదలౌతుంది. కానీ బయటకు చెప్పుకోలేరు. చివరకు తల్లిదండ్రుల ఆఖరి చూపుకు కూడా నోచుకోలేక పోతాడు.
==పాత్రల చిత్రీకరణ==
ఈ నవలలో గొల్లపూడి కొన్ని బలమైన పాత్రలు సృష్టించారు. నిజజీవితంలో ఇలాంటి పాత్రలు ఉంటాయా? అన్న మీమాంసను పక్కన పెడితే, నవనీతం, సంజీవి,కనబడ్డది కాసేపే అయినా మనసులో నిలిచిపోయే రేచకుడు, కొన్ని సంఘటనల్లో కూర్మయ్య, వెంకటాచలం – అద్భుతంగా చిత్రీకరించారు గొల్లపూడి గారు. దాదాపు ప్రతి ప్రాత్రా ఏదో ఒక సందర్భంలో తనదంటూ‌ ఒక ప్రత్యేక ముద్ర వేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/సాయంకాలమైంది" నుండి వెలికితీశారు