జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 33:
== ఎమర్జెన్సీ ==
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]] ని దోషిగా పేర్కొంటూ [[అలహాబాదు]] హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో [[అత్యవసర పరిస్థితి]] ([[ఎమర్జెనీ]]) ని విధించింది. జె.పి. ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినది. ఆఖరికి [[కాంగ్రెసు పార్టీ]] లోనే ''[[యంగ్ టర్క్‌]]'' లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.
జె.పి. [[ఛండీఘడ్]] లో డిటెన్యూ గా ఉంచబడ్డాడు. [[బీహారు]] వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించినది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు