శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
 
==సాహిత్య పోషణ==
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి ''సాహితీ సమరాంగణ సార్వభౌముడు'' అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో ''జాంబవతీ కళ్యాణము'', ''మదాలసాచరితము'', ''సత్యవధూపరిణయము'', ''సకలకథాసారసంగ్రహము'', ''జ్ఞానచింతామణి'', ''రసమంజరి'' తదితర గ్రంథములు, తెలుగులో [[ఆముక్తమాల్యద]] లేక [[గోదాదేవి కథ]] అనే గ్రంథాన్ని రచించాడు.<ref>[http://books.google.com/books?id=DH0vmD8ghdMC&pg=PA210&lpg=PA210#v=onepage&q&f=false Hinduism: An Alphabetical Guide By Roshen Dalal]</ref> ''తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స'' అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి [[భువన విజయము]] అని పేరు. భువనవిజయంలో [[అల్లసాని పెద్దన]], [[నంది తిమ్మన]], [[ధూర్జటి]], [[మాదయ్యగారి మల్లన]] (కందుకూరి రుద్రకవి), [[అయ్యలరాజు రామభద్రుడు]], [[పింగళి సూరన]], [[రామరాజభూషణుడు]] (భట్టుమూర్తి), [[తెనాలి రామకృష్ణుడు]] అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు [[అష్టదిగ్గజములు]] గా ప్రఖ్యాతి పొందారు.
 
==భక్తునిగా==