"శ్రీకృష్ణ పాండవీయం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
పాంచాలరాజు ద్రుపదుడు , అర్జునుడిని వివాహమాడు కుమార్తె, ద్రోణుని చంపు కుమారుని కోసం యజ్ఞం చేసి ద్రౌపదిని, దృష్టద్యముని సంతానంగా పొందుతాడు. లాక్ష్యగృహంలో పాండవులు దగ్ధమైనారని తెలిసి హతాశుడవుతాడు. విజ్ఞుల సలహాపై ద్రౌపది స్వయం వరం ప్రకటిస్తాడు. స్వయంవరానికి పాండువులు చేరుకొని అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. కుంతి మాట మీద, శ్రీకృష్ణుని ఉద్బోధ ననుసరించి పాండవులైదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.<br />
కుండినను పాలిస్తున్న భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి శ్రీ కృష్ణుని కథలు విని అతనిని వరిస్తుంది. ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని పై అకారణ ద్వేషం పెంచుకుంటాడు. శ్రీకృష్ణునికి జన్మతాః విరోధి యైన జరాసంధుని ప్రాపకం లో ఉన్న శిశుపాలునితో రుక్మణి వివాహం చేద్దామనుకుంటాడు రుక్మి. అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి రాయబారం పంపుతుంది రుక్మిణి. వివాహం ముందు దేవీ దర్శనానికి వెళ్లిన రుక్ముణిని తన రధం పై ఎక్కించుకొని తీసుకొని పోతాడు శ్రీ కృష్ణుడు. జరాసంధుని, శిశుపాలుని ఓడించి రుక్మికి సగం మీసం, సగం గుండు గొరికి శృంగ భంగం చేస్తాడు శ్రీ కృష్ణుడు.<br />
పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్న దృతరాష్ట్రుడు వారిని పిలిచి సగ రాజ్యభాగం ఇస్తాడు. ఇంద్రప్రస్ధ నగరాన్ని రాజధాని గా చేసుకొని ధర్మరాజు రాజ్యపాలన మొదలు పెడతాడు. ధర్మరాజు చేత రాజసూయం చేయించ సంకల్పిస్తాడు. శ్రీకృష్ణుడు మగధ రాజైన జరాసంధుని, భీమునిచేత చంపించి రాజసూయానికి మార్గం సుగమం చేస్తాడు. దేవశిల్పి మయుడు ధర్మరాజుకు సభా మండపాన్ని నిర్మించి ఇస్తాడు. రాజసూయానికి విచ్చేసిన దుర్యోధనునికి మయసభ విడిది. పాండవుల వైభవానికి అసూయ పడతాడు దుర్యోధనుడు. మయసభను వీక్షిస్తున్న దుర్యోధనుడు భంగపడతాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోదిస్తాడు. దానిని తప్పుపట్టి శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందిస్తాడు. నూరు తప్పులు పూర్తి కాగానే శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు చక్రాయుధం తో ఖండిస్తాడు. శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనతో చిత్రం ముగుస్తుంది.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1217355" నుండి వెలికితీశారు