సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
==పరిచయం==
[[దస్త్రం:Burning of a Widow.jpg|thumb|250px|1851లో ప్రచురితమైన "పిక్టోరియల్ హిస్టరీ ఆఫ్ చైనా అండ్ ఇండియా" పుస్తకములో ఒక సతీసహగమన దృశ్యము]]
'''సతీసహగమనం''' లేదా "సతీ" ([[దేవనాగరి]]: '''सती''') భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తెగలబెట్టుకొనే ఆచారము.
 
==చరిత్ర==
పంక్తి 8:
దేశవ్యాప్తంగా అగ్ర కులాలైన బ్రాహ్మణ , క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఉండేది. కళింగ విజయనగర సామ్రాజ్యంలో కూడ ఈ పద్దతి అమలులో వుండేది. ఆనాడు అనగా సుమారు 500 సంవత్సరాల క్రితం కళింగ విజయనగరాన్ని సందర్సించిన ఒక ఫోర్చ గీసు యాత్రికుడు సతీ సహగమన వ్వవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంది.
 
'' ఈ రాజ్యంలోని ప్రజలందరు విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తతో బాటు చితిలో దూకి మరణించటం వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవ ప్రథమైన చర్యగా భావిస్తారు. భర్త చనిపోయి నప్పుడు.... భార్య బందు వర్గంతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోధన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానె సహగమనానికి పురికొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి, సాంప్రదాయానికి భంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత ఆ మరణించిన వ్వక్తిని కర్రలతో చేసిన వేధిక పై పడుకో బెట్టి పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక చిన్న గుర్రంపై కూర్చో బెట్టి శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న ఆబరణాలనన్నీంటిని ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి వుంటుంది. చేతిలో అద్దం కూడ ధరించి వుంటుంది. శవం వెంబడి అనేక సంగీత వాయిద్యాలు, బాజా బజంత్రీలు రాగా వెనుక బందుజన సముదాయ నడుస్తుంతుంది. వీరందరు చాల సంతోషంగా వుంటారు. ఒక వ్వక్తి ఒక వాయ్యిద్యాన్ని వాయిస్తూ ఆస్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. 'నీవు నీ భర్తను చేరడానికి వెళుతున్నావు..... ' దానికి ఆ స్త్ర్హీ దానికి సమాదానంగా 'అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను.... '' అని పాట ద్వారా తెలుపుతుంది.
 
==తంతు==
భర్త శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వెధిక (చితి) పై పెడ్తారు., మరణించిన వ్వక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తన తల మీద ఒక నీటి తో నిందిన కుండ ను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక చితి తుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంధ్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి ఆ కాగడాను శవాని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతో కలిసి అక్కడకొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి అచారాలకు సంబందించిన కార్య క్రమాలు చేస్తారు. అప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆభరాణాలను తీసి తన బందువులైన స్థ్రీలకు పంచి ఇస్తుంది. అమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖమైన బందువులకు అప్పజెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక అమెకు ఒక సాధారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలో ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టు తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన అద్దం తమాపాకులు, వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్నీ తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకొని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగామండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేసిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో అమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారన్ని వ్వక్త పరుస్తారు. ఈ విధానము చాల ధైర్యంతో కూడు కున్నదే గాక నాకు చాల ఆచ్చ్యారాన్ని కలిగించింది. ఈ పద్దతి ఇక్కడి అధికారులకే గాక రాజు కు కూడ వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాల మంది భార్యలు వుంటే అతని మరణానంతరం వారందరూ ఇలా ఆగ్ని ప్రవేశం చేయు వలసిందే. తెలుగు వారికి మాతం ఈ అచారం లో కొంత మార్పు వున్నది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడతారు గనుక .... భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనె భార్య కొరకు ఇంకో స్తానం సిద్దం చేసారు. భర్త శవానికి ప్రక్కన భార్యను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు. అప్పుడు భార్య కూడ మరణిస్తుంది.''
 
==నేటి పరిస్థితి==
"https://te.wikipedia.org/wiki/సతీసహగమనం" నుండి వెలికితీశారు