సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Giant photovoltaic array.jpg|thumb|right|[[అమెరికా]]లో 14 మెగావాట్ల సోలార్ విద్యుచ్ఛక్తిని తయారుచేసే పవర్ ప్లాంట్.]]
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power, సొలార్ పవర్) సూర్యిడి కిరణాల నుండి వెలువడే [[శక్తి]]. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే [[బొగ్గు]], [[నూనె]], సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడాటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
==జలతాపకం==
సౌర శక్తి పొందటానికి వాడే సాధనాల్లో [[జలతాపకం]] మొట్టమొదటిది. వీటిని నల్ల రంగు పూసిన కాంక్రీట్ లో బిగించి ఉంటారు. నూర్య కిరణాల ఉష్ణాన్ని నలుపు రంగు గ్రహించటమే దీనికి కారణం. ఈ పెట్టెను గాజు పలకతో కప్పి ఉంచుతారు. గొట్టాల్లో ప్రవహించే నీళ్ళు సూర్యతాపం వల్ల బాగా వేడెక్కుతాయి. దీనిని పంప్ చేసి తొట్టిలో నిలవ చేసుకోవచ్చు. ఈ ఏర్పాటును ఇంటి పైకప్పు మీద అమర్చుతారు. ఒక్క ప్లోరిడాలోనే దాదాపు 50,000 ఇళ్ళలో ఇలాంటి వేడి నీటి యేర్పాట్లున్నాయి. [[ఇజ్రాయిల్]] లో అయితే వీటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.
పంక్తి 10:
సోలార్‌ వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు. వివిధ రకాల సోలార్‌ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్‌, హోం లైటింగ్‌ సిస్టమ్స్‌, వాటర్‌ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి.
సోలార్‌ టోపీ ముందుభాగంలో చిన్నపాటి ఫ్యాన్‌ అమర్చి ఉంటుంది. ఎండ వేడికి ఈ ఫ్యాను తిరుగుతూ చల్లటి గాలిని అందిస్తుంది. అపార్ట్‌మెంట్లపై సోలార్‌ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధ్వర్యంలోని ఏజెన్సీల వారు అపార్ట్‌మెంటును పరిశీలించి, ఎన్ని వాట్స్‌ విద్యుత్తు అవసరమన్నది అంచనా వేస్తారు. వారే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది.సోలార్‌ ఎమర్జెన్సీ లైటుని ఎండలో 6 గంటలు ఉంచితే మూడు గంటల పాటు నిరంతరాయంగా బల్బు వెలుగుతుంది. రాత్రి వేళ అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వీటిని ల్యాంప్‌లుగా ఉపయోగించుకోవచ్చు. సోలార్‌ హోం లైటింగ్‌ సిస్టంలో నాలుగు బల్బులుంటాయి. వీటికి ఉండే సోలార్‌ ప్యానెల్‌ని డాబామీద నీడలేని ప్రాంతంలో ఉంచాలి. ఇది వేడికి ఛార్జి అవుతుంది. ఇంట్లో నాలుగు గదులుంటే వాటిలో ఒక్కొక్క దానిలో ఒక్కో బల్బును వెలిగించుకోవచ్చు. ఇంటి ఆవరణలో సోలార్‌ వీధి దీపాలను ఒక పోల్‌కి అమర్చి దానిపై సోలార్‌ ప్యానెల్‌ ఉంటుంది. ఎండకు ఛార్జింగ్‌ అవుతుంది. రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతుంది.
సోలార్‌ వాటర్‌ హీటర్‌ ని శాశ్వతంగా ఇంటి డాబాల మీద ఏర్పాటు చేసుకోవాలి. పగలు ఎండకు నీళ్లు వేడెక్కుతాయి. అలా వేడెక్కిన నీరు 24 గంటల పాటు 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వెచ్చగా ఉంటాయి. మనం ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ట్యాంకు పైపులైనుకు పఫ్‌ ఏర్పాటు ఉంటుంది. అది నీరు చల్లబడకుండా కాపాడుతుంది. వీటిని ఆపార్ట్‌మెంట్లకు అమర్చుకొంటే విద్యుత్తు వినియోగాన్ని భారీగా ఆదా చేయవచ్చు. సోలార్ పవర్‌ ఇన్వర్టర్ల ద్వారా ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, టీవీ పనిచేస్తాయి. మూడు, నాలుగు గంటల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సోలార్‌ ప్యానెళ్లు ఎండకు ఛార్జి అయి, విద్యుత్‌ సరఫరా లేని సమయంలో పనిచేస్తాయి.
 
==[[సోలార్ బైక్]] ==
పుణేకు చెందిన ఆయూబ్‌ఖాన్ పఠాన్, ఇమ్రాన్‌ఖాన్ పఠాన్ అనే ఇద్దరు బాబాయ్, అబ్బాయ్‌లు ‘సోలార్ హైబ్రిడ్ ఎకోఫ్రెండ్లీ బైక్’ రూపొందించారు. ఇంధనం అవసరం లేదు.కాలుష్యం ఉండదు. శబ్దమూ రాదు.ఇంటిదగ్గరే ఉన్నప్పుడు దీని విద్యుత్ ను సెల్‌ఫోన్లు, బల్బులు, ఫ్యాన్లు, కంప్యూటర్‌లు, టీవీలకూ ఉపయోగించుకోవచ్చు. మోటారు బైకుకు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీ సీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దానితో మోటారు బైకు వెనక చక్రానికి అమర్చిన డీసీ మోటారు పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉండి, చార్జ్ అవుతున్న బ్యాటరీని మోటార్‌కు అనుసంధానిస్తే ఏకథాటిగా 200-250 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. బ్యాటరీలో విద్యుత్ ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంటుంది. బ్యాటరీకి మల్టీపర్పస్ సాచెట్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో, సూర్యరశ్మి లేనప్పుడు ఇంట్లోని విద్యుత్‌తో చార్జ్‌చేసుకోవచ్చు.ఈ బైకు ధర రూ. 27 వేలు. (సాక్షి25.5.2011)
 
==[[సౌర విద్యుత్తు]]==
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు