స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యతిరేక వాదన: లింకులిచ్చాను
చి Wikipedia python library
పంక్తి 10:
* ఇటువంటి ప్రకృతి విరుద్ధ చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో జంతువులతో సంభోగానికీ అనుమతివ్వాలని కోరే ప్రమాదముంది.
* స్వలింగ సంపర్కంపై మోజు ఉన్నవారు తప్పితే దీనికోసం ఎవరూ పోరాడటం లేదు.
*సుప్రీంకోర్టు వివిధ మతాల మనోభావాలను గౌరవించింది. స్వలింగ సంపర్కం కచ్చితంగా రోగమే. దాన్ని నయం చేయాల్సిందే.సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి మగాళ్ళతో మగాళ్ళూ ,ఆడవాళ్ళతో ఆడవాళ్ళూ,అటూ ఇటూ కాని నపుంసకులూ కలిసి వాళ్ళలోవాళ్ళు సహజీవనం చెయ్యడం,పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటీ?కొన్నాళ్ళుపోతే పశువుల్ని కూడా పెళ్ళాడతామంటారు.పశువులతో కాపురం చెయ్యనిస్తారా?ఈ దేశ సాంస్కృతిక, మతపరమైన విలువలకు స్వలింగ సంపర్కం విరుద్ధం. గే సెక్స్‌ అనేది పాశ్చాత్య దేశాలలో చెల్లుతుందేమోకానీ, సాంప్రదాయ భారతావనిలో చెల్లదు. ఈ అపవిత్ర బంధానికి దేశంలో ఎంతో వ్యతిరేకత ఉంది. మన దేశంలోకి పాశ్చాత్య దేశాల వాళ్ళు బరితెగించి చేసే పాడుపనులు చాపకిందనీరులాగా చేరిపోతున్నాయి. అందుకే ఒళ్ళుబలిసినవాళ్ళు గే సెక్స్‌ను చట్టబద్ధం చేయాలంటూ పోరాటం చేస్తున్నారు. గే సెక్స్‌ అనైతికమైనది. ఇది విపరీత బుద్ధి. దీనిని చట్టబద్ధం చేస్తే సమాజంలో నైతిక విలువలు పతనమవుతాయనే సంగతిని పట్టించుకోకుండా స్వలింగసంపర్కుల మనోవాంఛలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు గే సెక్స్‌ తప్పుకాదంటూ తీర్పునిచ్చేసింది. ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు చాలా తప్పుడు తీర్పు. స్వలింగ సంపర్క అనుకూల చట్టాలు సహజ విరుద్ధమైనవి. వాటిని అనుమతించకూడదు. అది లైంగికపరమైన అవినీతికి దారితీస్తుంది.ప్రకృతి విరుద్ధమైన చర్యలవల్ల కలిగే దుష్ఫలితాలు ఊహించలేనివి.స్వలింగ సంపర్కం ద్వారా ఎయిడ్స్ త్వరితగతిన వ్యాపిస్తుంది. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నో స్వలింగ సంపర్క వివాహాలు జరిగాయి. అసలు వివాహ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతోంది.అన్ని మతాల పవిత్ర గ్రంధాలు సహజీవనాన్నీ స్వలింగ సంపర్కాన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కోట్లాదిమంది మతవిశ్వాసాలను గౌరవించిందికాబట్టే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తెచ్చింది. భారతదేశంలోని అనేక మతాలు నెలకొల్పిన సంస్కార విలువలను కాలరాసేందుకు కొంతమంది పనిగట్టుకొని ప్రణాళిక ప్రకారం చేస్తున్న నేరపూరిత కుట్ర ఇది. మన సంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నం ఇది.ఇటువంటి ప్రకృతి విరుద్ధ చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో జంతువులతో సంభోగానికీ అనుమతివ్వాలని కోరే ప్రమాదముంది. స్వలింగ సంపర్కంపై మోజు ఉన్నవారు తప్పితే దీనికోసం ఎవరూ పోరాడరు”. (బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్, బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, బీపీ సింఘాల్, ఢిల్లీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌, [[ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు|అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌]] , [[దారుల్ ఉలూమ్ దేవ్ బంద్|దారుల్ ఉలూం దేవ్ బంద్]], ఉత్కల క్రిస్టియన్ కౌన్సిల్, అపొస్టలిక్‌ చర్చెస్‌ అలియన్స్‌,యోగాగురు బాబా రాందేవ్ వగైరా ....)
 
== అనుకూల వాదన ==
పంక్తి 16:
* ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో చాలా ప్రాచీన చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి.
* మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పోలీసులకు కోర్టు బుద్డిచెప్పింది. స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది.
*”మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగాఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు.వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తప్పు లాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడట. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లోనే ‘స్వలింగ సంపర్కం ఒక దుర్వ్యసనం కాదు.అదేదో తప్పుడుపని అయినట్లు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం’ అన్నాడు. స్వలింగ సంపర్కం మానవ హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాసరే నేరారోపణకు ఎందుకు గురికావాలి? మానవ హక్కులకు ‘పాశ్చాత్యం’ లేదా ‘ప్రాచ్యం’ 'అప్రాచ్యం' అంటూ తేడా ఏమీ ఉండదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల అయ్యప్ప స్వామి అట్లాంటిక్ తీరంలో పుట్టలేదు. మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా అన్యాయమైనదే. వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఈ స్వలింగ సంపర్కం ఉంది.పూర్వం ఏనాడో దేవాలయాల గోడల మీద చెక్కిన అసంఖ్యాక స్త్రీ పురుష సంభోగ శిల్పాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతున్నాయి.హిందూ దేశం చాలా స్వేచ్చాయుత దేశం. పుత్రకామేష్ఠి,పుండరీక లాంటి యజ్నాలూ యాగాలూ కూడా జరిగాయి. హిజ్రాల దేవత ముర్గీ మాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వలింగ సంపర్క హక్కులను కాలరాసింది. కోర్టు తీర్పు వారి జీవిత హక్కులను లాగేసుకుంది.స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న 1861 నాటి చట్టాన్ని సమూలంగా మార్చాలి.ఈ తీర్పుపై పునఃసమీక్షను కోరుతాం.స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న ఐపిసి 377వ సెక్షన్‌ను కొట్టివేయాలి. స్వలింగ వివాహాలు కేవలం సంపర్కం కోసమే కానక్కరలేదు.అంతకంటే ముఖ్యంగా జీవితంలో ఇష్టమైన వ్యక్తితో అవసరమైన తోడు కోసం కూడా స్వలింగ వివాహం అవసరం కావచ్చు.ఒక 'చారిత్రాత్మక అవకాశం' చేజారిపోయింది.స్వలింగసంపర్కం నేరమనే ఐపిసి 377 సెక్షన్‌ 'మధ్యయుగ మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోంది. ఇది మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని దేశ ప్రజలపై రుద్దడమే.అంతకుమునుపే మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది కదా? . స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న పోలీసులకు హైకోర్టు ఆనాడే బుద్డిచెప్పింది.హైకోర్టు తీర్పు తరువాత స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది. మానవహక్కుల గురించి మాట్లాడే సుప్రీంకోర్టు ఎందుకోగానీ స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు తప్పుబట్టాలి? ఈ వ్యవహారంలో పార్లమెంటు జోక్యాన్ని న్యాయవ్యవస్థ కోరింది కాబట్టి పార్లమెంటు చట్టాన్ని మార్చాలి.తీర్పు తిరోగమన దిశలో ఉంది. ఇద్దరు పురుషులు లేదా మహిళలు పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొంటే అది నేరం ఎందుకవుతుంది? ఈ తీర్పు వల్ల గేలు, లెస్బియన్‌లు, హిజ్రాలపై వివక్ష తొలగిపోదు.వాళ్ళు భయం భయంగా, సమాజానికి దూరంగా ఉండిపోతారు. పౌరసమాజంలో బహిరంగ భాగస్వాములు కాలేరు.ఎన్నో ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకున్నాం. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో కొన్ని ప్రాచీన మూర్ఖపు చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి,సంస్కరించాలి.ఇద్దరు మగవాళ్ళుగానీ ,ఇద్దరు మహిళలు గానీ కలిసి కాపురం చేస్తే అది కేవలం శారీరక సంభోగం కోసమే కానక్కరలేదు.పెళ్ళి చేసుకునో, చేసుకోకుండానో ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేస్తే దానిని ‘సక్రమ సహజీవనం’అన్నారు.పెళ్ళి కాకుండా చేసే సహజీవనం అసహజమైనది,నేరము,పాపము కానప్పుడు స్వలింగ వివాహం నేరమెలా అవుతుంది?ఇందులో తప్పేంటి? ”(అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్‌ , నాజ్ ఫౌండేషన్, ఇండియన్ ఆమ్నెస్టీ ,జెడి(యు) ఎంపి శివానంద్‌ తివారీ, టిఎంసి ఎంపి డిరెక్‌ ఒబ్రీన్‌, సిపిఎం ఎంపి సీతారాం ఏచూరి, సినీ నటి మియా ఫారో, హీరోలు అమీర్‌ఖాన్, జాన్ అబ్రహం, రచయిత ఫర్హాన్అక్తర్ , కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్,కేంద్రమంత్రులుసల్మాన్‌ఖుర్షీద్‌,జైరాంరమేశ్,సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌,సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,చిదంబరం వగైరా ....)
 
== పోరాట చరిత్ర ==
పంక్తి 58:
==భారత ప్రధాన న్యాయస్థానం ([[సుప్రీంకోర్టు]]) తీర్పు==
స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ఈ మేరకు వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది. స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని, అది నేరమని, జీవితఖైదు వరకు విధించగలిగేంత శిక్షార్హమని చెప్పే ఐపీసీ సెక్షన్ 377లో రాజ్యాంగపరంగా ఎలాంటి సమస్యా లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ సెక్షన్ ను ఐపీసీ నుంచి తొలగించాలా లేదా అనే విషయాన్ని శాసన వ్యవస్థ చూసుకోవాలని తెలిపింది.వ్యక్తిగత జీవితంలో ఇద్దరి అంగీకారంతో జరిగే హోమోసెక్సువాలిటీ నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును కొట్టేసింది. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధమని వివిధ సంస్థలు కోర్టులో వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసినా, ఈ వివాదాస్పద అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్లమెంటేనంటూ వ్యాఖ్యానించింది.
==సుప్రీం కోర్టు కోరిన వివరాలు ==
1.లైంగిక మైనారిటీల విషయంలో ప్రభుత్వ సంస్థలు వివక్ష కనబరుస్తున్నాయని, కనీస మానవహక్కులను నిరాకరిస్తున్నారని రుజువులు
2.ప్రజల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు
పంక్తి 64:
4. 1950 నుండి ఐపీసీకి 30 సవరణలు జరిగాయి. 2013లో జరిగిన ఒక సవరణ ప్రత్యేకించి లైంగిక నేరాలకు సంబంధించినదే. ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని 172వ లా కమిషన్‌ నివేదిక ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఈ అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా ఈ చట్టాన్ని సవరించాలని శాసనవ్యవస్థ అనుకోలేదు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదే. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుంది.
==శిక్ష ఏమిటి?==
53 కామన్‌వెల్త్ దేశాలలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇరాక్, నైజీరియా, మాస్కో, కామెరూన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్కలు జైళ్ళకు నెట్టబడుతున్నారు. కొన్ని సందర్భాలలో శిరచ్ఛేదనకు కూడా గురవుతున్నారు. మనదేశంలో ఐపిసిలోని 377 సెక్షన్ ప్రకారం గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది. సెక్షన్ 377ను సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు 2009 జూలై 2న పరస్పర సమ్మతితో యుక్తవయస్కులు స్వలింగ సంపర్కానికి పాల్పడితే నేరం కాదని పేర్కొంది. లార్డ్ మెకాలే 1860లో రూపొందించిన భారతీయ శిక్షా స్మృతిలోని 377 సెక్షన్‌లో స్వలింగ సంపర్కాన్ని మళ్ళీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా ప్రకటించారు. 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. భారత శిక్షాస్మృతి సెక్షన్ 377 (అసహజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమైన శృంగార కార్యకలాపానికి పాల్పడినవారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముందని సుప్రీంకోర్టు తెలిపింది దీని ప్రకారం స్వలింగ సంపర్కులకు గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చు. బ్రిటన్‌లో ఈ చట్టానికి 1967లో సవరణ చేశారు. 21 ఏళ్లు దాటిన వారు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే చట్టవిరుద్ధం కాదని మార్పు చేశారు.
==స్వలింగ వివాహాలు==
స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. 2001లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజీలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్‌ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లిళ్లను చట్టబద్ధం చేశాయి. ఈ ఏడాదే బ్రిటన్ ఆమోదం తెలిపింది. అయితే చర్చి అధికారులను మాత్రం చట్టం నుంచి మినహాయించారు. న్యూజీలాండ్‌లో విదేశీయులు కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. ఉరుగ్వేలో మామూలు పెళ్లికి, స్వలింగ సంపర్కుల పెళ్లికి ఒకే విధమైన నిబంధనలను రూపొందించారు.అయితే 12.12.2013 న ఆస్ట్రేలియాలో గే వివాహం చట్టం రద్దు చేస్తూ ఆస్టేలియా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌లో స్వలింగ సంపర్క దంపతులు పిల్లలను దత్తత తీసుకోడానికి అనుమతిస్తూ చట్టం ఉంది. 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు దీని ప్రకారం గుద సంభోగం, అంగచూషణం, జంతువులతో సంభోగం.. అన్నీ నిషిద్ధాలే. పునరుత్పత్తికి దోహదం చెయ్యని ఏ రకమైన లైంగిక క్రియ అయినా ఈ నిబంధన ప్రకారం శిక్షార్హమే. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సెక్స్‌ వర్కర్లనూ, స్వలింగ సంపర్కులనూ వేధించే పనీ దేశంలో నిరాఘాటంగా సాగిపోతోందని, కాబట్టి ఈ నిబంధనను తొలగించటం చాలా అవసరమని 'హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌' వంటి సంస్థలు ఉద్యమాలు ఆరంభించాయి. ముఖ్యంగా దేశంలో హిజ్రాలపై వేధింపులు ఎక్కువయ్యాయనీ, వారికి కనీస మానవ హక్కులు కూడా దక్కటం లేదని, హక్కుల సంస్థలు వాదించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ నిబంధనపై చర్చ వూపందుకుంది. దీన్ని తొలగించటం అవసరమని, అప్పుడే తమకు సామాజిక గుర్తింపు, సమర్థన లభిస్తుందని, తమపై వేధింపులు తగ్గుతాయని స్వలింగ, ద్విలింగ సంపర్కులూ, హిజ్రాలూ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌-ఎల్‌జీబీటీ) బహిరంగంగా డిమాండు చేయటం ఆరంభించారు.
 
== మతాలు ఏంటున్నాయి ==
=== హిందూ మతం ===
*వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో స్వలింగ సంపర్కం ఉంది.అందుకే దేవాలయాల గోడల మీద సైతం స్త్రీ పురుష స్వలింగ సంభోగ శిల్పాలు ఆనాడే చెక్కించారు.
*హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టించారు.
*తెలుగు సంవత్సరాలు 60.నారదమహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు.వారే వీరు.
*పురాణాలు ఉపనిషత్తుల సారం తోటి మానవునిలో భగవంతుణ్ణి చూడటం.స్త్రీ పురుష లక్షణాలు రెండూ లేని తృతీయ ప్రకృతి జీవులు కూడా భగవత్ స్వరూపులే.
*కామసూత్రాలలో స్వలింగసంపర్కులు, లింగమార్పిడిదారులకు , క్లైబ్య,నపుంసక,ఆడంగి,షండ,స్వైరిణి,నస్త్రీయ,హిజ్రా,అరవాణి ,జోగప్ప,సాఖీబేకీ,బృహన్నల,శిఖండి,పేడి,కొజ్జా,మాడా లాంటి పేర్లున్నాయి.వీరిని విటులు లైంగికంగా హింసించి శిక్షించేవారు. ఆడ మగ కాని ఈ తృతీయపురుషుల్ని దేవుడి గుడుల్లో,ఉత్సవాలలో శుభసూచకంగా భావిస్తారు.వీళ్ళకు శపించే వరమిచ్చే మహిమ లున్నట్లు భావిస్తారు.
*అహం బ్రహ్మాస్మి ప్రకారం అందరూ పరబ్రహ్మలే గనుక వీళ్ళను వివక్షతో చూడకూడదు.తృతీయా ప్రకృతి జీవులను,స్వలింగసంపర్కులను కూడా మనతో సమానంగా గౌరవించాలి.
*ఆయుర్వేదం ప్రకారం గర్భధారణ జరిగిన మొదటి రెండు నెలల్లోనే పిండంలో తృతీయా ప్రకృతి లక్షణాలు జనిస్థాయి.
పంక్తి 80:
*జీవితాంతమూ బ్రహ్మచర్యాన్నీ పాటించటం కష్టమే.కానీ బ్రహ్మచర్యమూ, సర్వసంగపరిత్యాగమూ, భవబంధ విమోచనము,ముక్తి పొందటానికి మొదటి అవసరం.ఆధ్యాత్మికతలో ఏకపత్నీవ్రతానికి దక్కేది రెండవ స్థానమే.మొదటి స్థానం బ్రహ్మచర్యానిదే.
*అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీ కృష్ణుని వర్ణన చూడండి. '' కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవ మౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం..'' ఇలాంటి అలంకరణలేన్నో మన పురాతన పురాణాలలో కనుపిస్తాయి.
*దైవశక్తి తరతమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ,చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దేవుడున్నాడు.సర్వాంతర్యామి అయిన దేవుడే చేప, తాబేలు, పంది, సింహం,కుక్క ,పాము అవతారాల్లో ఉన్నపుడు సాటి మనిషి అంటరాని వాడు ఎలా అవుతాడు?
 
=== క్రైస్తవం ===
పంక్తి 89:
*ఇంచుమించు స్వలింగ సంపర్క స్థాయిలోకి వెళ్ళినట్లు మూడు జంటలను ఉదారవాద క్రైస్తవ పండితులు అనుమానిస్తారు:
#రూతు నయోమి--- రూతు ఆమెను హత్తుకొనెను. (“Ruth clave onto her." Ruth 1:14)
#దావీదు-యోనాతాను ----యోనాతాను హృదయము దావీదు హృదయముతోకలిసిపోయెను;యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.(1 సమూయేలు 18:1). యోనాతాను దావీదు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.(The soul of Jonathan was knit with the soul of David, and Jonathan loved him as his own soul (1 Samuel 18:1).they kissed one another and wept with one another, until David exceeded (1 Samuel 20:41)
#దానియేలు అష్పెనాజు --- దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను ( God had brought Daniel into favor and tender love with Ashpenaz the prince of the eunuchs (Daniel 1:9)
*మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అనే ఏడుగురు నపుంసకులు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేసేవాళ్ళు.అందరిముందుకు వచ్చివిందులో తన అందాలను ఆరబోయటానికి నిరాకరించిన సౌందర్యవతి రాణి వష్తి .హేగే అనే నపుంసకుడు అంతఃపుర స్త్రీల కాపరి.బిగ్తాను తెరెషు అనే నపుంసకులు అహష్వేరోషును చంపటానికి ప్రయత్నిస్తారట(ఎస్తేరు1,2,6).వీళ్ళంతా పరిశుద్ధ గ్రంధాలలో ప్రసిద్ధిగాంచిన నపుంసకులు.వాళ్ళ సేవలను రాజులు బాగానే ఉపయోగించుకున్నారు.వ్యభిచారం చెయ్యని చెయ్యలేని నపుంసకుల్ని కూడా హీనంగా చూడటం,వారికి మానవహక్కులు లేకుండా చేయటం అన్యాయమనేదే వారి వాదన.నపుంసకులకు బైబిలు గానీ ఖురాను గానీ వ్యతిరేకం కాదు.స్వలింగ సంపర్కానికి మాత్రమే అవి వ్యతిరేకం.
*ఐతియొపీయుల రాణియైన కందాకే మంత్రి ధనాగార అధికారి అయిన నపుంసకుడు దైవారాధనకోసం యెరూషలేముకు వచ్చాడు.ఆరాధనకు,బాప్తిస్మానికి నపుంసకుడు అనర్హుడని వివక్ష చూపలేదు.పిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మమిచ్చాడు.(అపో.కా.5:27-39)
*తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. ఈ మాటను అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని యేసు వారితో చెప్పెను.(మత్తయి 19:12)
* జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.(1 కోరింథీయులకు 6:9,10)
* ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెను ( 1 తిమోతి1:9,10)
 
పంక్తి 103:
*ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురిపించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు. (ఖురాన్ 11:82-83)
*అతి ఘోరపాపాల్లో స్వలింగ సంపర్కం అనేది పదకొండవది.వ్యభిచారాన్నిబట్టి అల్లా ఎవరినీ నాశనం చేయలేదుగానీ స్వలింగసంపర్కుల్నిబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలనే కాల్చివేశాడు.స్వలింగసంపర్కుల పాపాలను కడగటానికి ప్రపంచంలోని నీళ్ళన్నీ కూడా సరిపోవు.వాళ్ళు నరకంలోని అడుగుభాగానికి పోయి బయటకు రాలేరు.
*స్వలింగసంపర్కం,వ్యభిచారం ఈ రెండే జీవితంలోని 72 రకాల పాపాలకు కారణం( హజరత్ ఇమామ్ అలి అర్రదా).
*బలవంతంగా తన బానిసపై స్వలింగ సంపర్కానికి పాల్పడిన యజమాని లూతు కాలంనాటి పాపిష్టి ప్రజలలో చేరిపోయినట్లు ఉమర్ ప్రకటించారు.
*పురుషులతో పురుషులు,స్త్రీలతో స్త్రీలు శృంగారానికి,సంభోగానికీ పాల్పడితే వ్యభిచారులతో సమానంగా శిక్షించాలి.స్వలింగసంపర్కులు రెండుసార్లు రాళ్ళతో కొట్టి చంపదగ్గ వారు. వారికి మరణశిక్ష విధించి శవాలను తగలబెట్టాలి.(అమీరుల్ మూమినీన్ అలి)
పంక్తి 111:
యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో అధ్యాపకుడిగా పనిచేసిన బ్రూస్ బాగ్‌మిల్ బయోలాజికల్ ఎగ్జూబరెన్స్: యానిమల్ హోమోసెక్సువాలిటీ అండ్ నేచురల్ డైవర్సిటీ అనే పుస్తకంలో 450 రకాల పాలిచ్చే జీవులపైన, పక్షులపైన, కీటకాలపైన, జంతువులపైన శాస్త్రీయంగా పరిశోధనచేసి వాటిలోని స్వలింగ సంపర్క ధోరణులను, పుంసక మార్పిడి ధోరణులను (ట్రాన్స్‌జెండర్ బిహేవియర్) సవివరంగా చర్చించారు. పురుష స్వలింగ సంపర్కులందర్నీ కలిపి గతంలో 'గేస్' (Gays) అనే పదం వాడేవారు కాని ఇప్పుడు మాత్రం వారిని ఎం.ఎస్.ఎం.లు అంటున్నారు. ఎంఎస్ఎం అంటే మాన్ టు మాన్ సెక్స్ అని.
==సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం==
బలాత్కారములేని స్వచ్ఛంద స్వలింగసంపర్కం కూడా సహజీవనం లాగానే నేరము కాదు,పాపము కాదు . 377 వ నిబంధనకు సవరణ కోర్టులు తేల్చాల్సిన అంశం కాదు. ఇది కీలకమైన సామాజికాంశం. దీనిపై పార్లమెంట్‌ చర్చించి, నిర్ణయంతీసుకోవాలి. నిబంధనను మార్చే అధికారం పార్లమెంట్‌కే ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. పార్లమెంట్‌లో చర్చించాలి. మనుషులు జంతువులకు భిన్నంగా ఇలా వుండాలి అనే కట్టుబాటు ఉంది.స్వలింగ సంపర్కాన్నే నేరంగా భావించాలా?లేక స్వలింగ వివాహాన్ని కూడానా? బహుభార్యత్వం,సహజీవనం, వ్యభిచారం, ఐచ్చిక శృంగారం పేరేదైతేనేం జరిగేది సంభోగమే. అయితే ఆ సంభోగమైనా సహజీవనమైనా పరపీడనలేని పద్ధతిలో మాత్రమే జరగాలి.నవీన కాలపు వైద్యులు వ్యభిచారం,అత్యాచారాలకు పాల్పడేదానికంటే కంటే హస్తప్రయోగమే మంచిదని సలహాలిస్తున్నారు.అత్యాచారాను ఆపటం కోసం హస్తప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే సమాజంలో చోటుచేసుకున్న వికృత పోకడలలో బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారం లాంటి కుళ్ళు కన్నా స్వలింగ సంపర్కం,సహజీవనం లాంటి పుచ్చు మెరుగు అనిపిస్తోంది. వాత్సాయన కాలం నుండి నేటి వరకు ఏ సమాజము కాని చట్టాలు కాని శృంగారం దంపతుల మధ్యనే వుండాలని పరిమితులు విధించలేదు.పరపరాగ సంపర్కాన్ని అరికట్టనూ లేదు.అది అరికట్టలేనిది.అయితే స్వేచ్చా సంభోగాలను అరికట్టాలనే ఉద్దేశంతో లౌకిక నాగరిక సమాజం నైతికత ముసుగును కప్పుకుంది అంతే. శృంగారం ఇరువురు వ్యక్తుల మధ్య అభీష్టానుసారం జరిగితే అభ్యంతరకరం కానవసరం లేదు. సామాజిక కట్టుబాట్లు ఎన్నో పెట్టినా వ్యభిచారం ఆగలేదు.వ్యభిచారం వేరు, అత్యాచారం వేరు .ఐచ్చిక శృంగారం వేరు . పురాణ ఇతిహాస కాలం నుండి నేటి చట్టాల వరకు వాటిలో ఐచ్ఛిక శృంగారానికి అభ్యంతరాలు లేవు. నాగరిక సమాజంలో నాటి జంతుసామ్య వ్యవస్థలో జీవించినట్లుగానే జీవిస్తామంటే కుదరదు.బయట పడాలి.చెప్పేదొకటి చేసేదోకటి ఉండకూడదు.సామాజిక జీవన వ్యవస్తలో మార్పులకు అనుగుణంగానే చట్టాలలో కూడా నైతికతను పటిష్టపరుచుకోవాలి. లైంగిక సంపర్కం కోసం పశువులా బలత్కరించడాన్ని నేరంగా పరిగణించాలి. లైంగిక సంపర్కం కోసం బలత్కరించడమంటే వ్యక్తి స్వేఛ్చకు భంగం కలిగించడమే. లైంగిక సంపర్కం కోసం బలత్కరించేవారిని శిక్షించాలి. అదే సందర్భంలో పరస్పర ఇష్టపూర్వకంగా జరిగే లైంగిక సంపర్కాలను నేరంగా, తప్పుగా పరిగణించకూడదు.స్వలింగ సంపర్కం రోగమైతే వైద్యము చేసి నయం చేయాలి. నేరమైతే కోర్టుద్వారా శిక్షించాలి.రోగికైనా ,ఖైదీకైనా ప్రాధమిక హక్కుల్నిమాత్రం ప్రసాదించాలి.వాటిని కాలరాయకూడదు.<ref>http://uttaralu1.blogspot.in/2013/12/blog-post_718.html</ref>
 
== ఆరు రకాల స్వలింగసంపర్కులు ==
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు