హొ చి మిన్: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1890 జననాలు; +వర్గం:1969 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 5:
హొ చి మిన్ మే 19, 1890న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే [[గ్రామం]]లో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న [[ఇండోచైనా]] ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత [[1911]] లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత [[లండన్]] మరియు [[పారిస్‌]] లలో పనిచేశాడు.
[[మొదటి ప్రపంచ యుద్దం]] ముగిసిన తరువాత [[ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ]] స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు [[మాస్కో]] వెళ్ళాడు. ఆ తరువాత [[1924]] లో [[చైనా]] వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. [[1930]] లో [[ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ]] ను చైనాలో స్థాపించాడు. [[హాంకాంగ్]] లో [[కమ్యూనిష్టు ఇంటర్నేషనల్]] ప్రతినిథిగా ఉన్న సమయంలో [[1931]] జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హొ ను అరెష్టు చేసి [[1933]] వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా [[సోవియట్ యూనియన్]] వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. [[1938]] లో మరలా చైనా వెళ్ళాడు.
 
"https://te.wikipedia.org/wiki/హొ_చి_మిన్" నుండి వెలికితీశారు