కావలి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== పేరు వెనుక చరిత్ర ==
#శుచిగా స్నానంచేసి, తూర్పువైపుగా తిరిగి, మనం కోరుకున్నది ‘కావాలి... కావాలి...’ అని మూడుసార్లు చొప్పున మూడు రోజుల పాటు చేస్తే సరిగ్గా వారం రోజుల్లో కోరుకున్నది జరిగిపోయేదని పూర్వం నమ్మకం ఉండేది. దానివల్ల ఈ ప్రాంతానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారనీ, దాంతో ఈ ప్రాంతానికి ‘కావాలూరు’, ‘కావాలిపురం’, ‘కావాపురం’గా రకరకాలుగా పిలవబడేదనీ ప్రాచుర్యంలో ఉన్న గాథ. ఇదే కాలక్రమంలో ‘కావలూరు’గా మారి ప్రస్తుతం ‘కావలి’గా వ్యవహరించబడుతోంది.
#పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి" గా వాడుకలోనికి వచ్చినది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయినది.
#మరోకోణంలో, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమ
తమసరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇతు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటులు సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద ఏర్పడిన "కావలి", నేడు వ్యాపార కూడఈఇగా విరజిల్లుతున్నది. [2]
 
==శాసనసభ నియోజకవర్గం==
* పూర్తి వ్యాసం [[కావలి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
=='''రవాణా సౌకర్యాలు'''==
 
=== రహదారి మార్గము===
 
కావలి పట్టణం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) లేక నూతన ఆసియా రహదారి లేక పాత గ్రేట్ నార్తరన్ ట్రంక్ రోడ్ (G.N.T తెలుగులో గొప్ప ఉత్తరపు తొండపు మార్గము) అనబడే మార్గము మీద నెల్లూరు-ఒంగోలు పట్టణముల మధ్య ఉన్నది. నెల్లూరు ఒంగోలు జిల్లాలను కలిపే పట్టణము. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలతో ఉన్నది. 2014 కల్లా ఇది ఆరు వరుసలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కడప, ఒంగోలు, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.
 
===రైలు మార్గము===
 
కావలి పట్టణం ఒకప్పటి ఆంగ్లేయుల భారత దేశ మొదటి రాజదాని అయిన కలకత్తా మరియు ప్రావిన్స్ రాజదాని అయిన మద్రాసు నగరాల మద్య తరువాత దేశ కొత్త రాజదాని అయిన డిల్లీ మరియ అవిభక్త మద్రాసు ప్పావిన్సు (దరిదాపు సమస్త దక్షిణ భారత) రాజదాని అయిన మద్రాసు (చెన్నై) నగరాలను లేక కొంకణ్ రైల్వే ఏర్పడక ముందు వరకు దేశంలో ఉత్తర, ధక్షిణ ప్రాంతాలను కలిపే ఏకైక మార్గమైన, ఇప్పటికీ దేశంలోని అత్యంత ప్రధానమైన మరియు రద్దీ అయిన ట్రంక్ రైలు మార్గంలో గూడూరు-విజయవాడ జంక్షనుల మద్య దేశంలోనే రద్దీ అయిన రైలు మార్గములో ఉన్న ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, న్యూఢిల్లి, అహ్మదాబాదు, జమ్ము, తిరువనంతపురం .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.
Line 100 ⟶ 103:
 
[1] ఈనాడు నెల్లూరు; 2014,మే-20; 5వ పేజీ.
[2] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-16; 4వ పేజీ.
 
{{కావలి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు