అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 155:
*'''ముళ్ళపూడి వెంకటరమణ'''-"అమరావతి కథలు అపురూప శిల్పాలు....ఊత్తమశ్రేణి ఆధునిక కథావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే.....వేయిపుటల వేయిపడగల కథలో సత్యనారాయణగారు చిత్రించిన తెలుగుజీవన విశ్వరూపానికి మూడు వాక్యాలో-మూడు మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి......త్యాగరాజస్వామి - కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుడిని అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుడిని, ఆయనను సేవించుకునే తెలుగువాడిని అర్చించారు.....పట్టరాని అనందం కొద్దీ మనసులో వెయ్యి పేజీలు రాసుకున్నాను. చదివిన ప్రతివాళ్ళూ పదివేల పేజీలు రాసుకోగలరు కూడా......తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం, అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌదర్యానికి పరమావధి, పపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.
*'''వావిలాల సుబ్బారావు'''".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" .<ref name="vavilala"/>
*'''ఎమ్వీయల్''' పుస్తకం చివరలో "మారేడు దళం" అనే పద్య రూప ప్రశంసలో <ref> పుస్తకంలో చివరిమాటగా "మారేడు దళం" </ref> శంకరమంచి అమరావతి కథలు.....విశ్వరూప సాక్షాత్కారం........ప్రతి కథలోనూ చివరిలో ఉండే కొస మెరుపే కథలకి మకుటం......తెలుగుదేశ చరిత్ర.....తెలుగు వారికి దొరికిన మహా ప్రసాదం....కథలన్న కథలా! ఎలాంటి కథలవి!......అతగాడి రాత బాపుగీత వెలుగు వెన్నెల కలనేత.
*'''సాహిత్యాభిమానులు'''-"........ ఈ కథలలో శిల్పమే ఆ కథలకు ప్రాణం"-తాతా ప్రసాద్. <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0107.html "తెలుసా" చర్చా వేదిక] - తాతా ప్రసాద్ వ్యాఖ్య</ref>ఈ కథలలో గత స్మృతులు, మానవ సంబంధాలు, కాలం ముద్రలు, విషాదం, హాస్యం, వ్యంగ్యం పెనవేసుకొని ఉన్నాయి........ ఈ కథలు చదువరుల గుండె అంచులను పట్టుకొని లాగుతాయి....... <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0098.html "తెలుసా" చర్చా వేదిక] - జంపాల చౌదరి </ref>-జంపాల చౌదరి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు