అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 19:
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
'''[[అలిపిరి]]'''
పూర్వం రవాణా సౌకార్యాలు అంతగా అభివృద్ది చెందని కాలంలో తిరుమల పైకి వెళ్ల డానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారె శరణ్యం. సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడిచి వెళ్లే వారు. నడవ లేని వారికి ''డోలీలు'' వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడ భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు ''బండ్ల వీది'' అది ఈ నాటికి వున్నది. ఆ విధంగా ఆరోజుల్లో సుధూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి ''అలిపిరి'' అని పేరు. ''అలిపిరి'' అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే.... గతంలో దళితులు అనగ అంటరాని వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడ మోపే వారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరిని కట్టడి చేయకున్న స్వచ్చందంగా వీరు కొండ పైకి ఎక్కే వారు కాదు. అలా కొండ పై కాలు మోపితే మహా పాతకం చుట్టు కుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం వున్నది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు వున్నది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవ దేవుని అనుగ్రహం పొందే వారు. ఆలా వారు తర తరాలుగా తలలు ఆ గుండుకు తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈ నాటికి వున్నది. దానిని [[తల తాకుడు గుండు]] [[తల యేరు గుండు]] అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాల కష్టంగా వుంటుంది. మోకాళ్లు పట్టు కోకుండా ఆ కొండను ఎక్కలెరు. మోకాళ్లు నెప్పులు రాకుండా వుండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నెప్పి వుండదని పూర్వీకుల నమ్మకం: అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తర తరాలుగా తాకించి నందున దానికి గుంటలు పడి వున్నాయి. దానిని ఈ నాటికి చూడ వచ్చును. ఆ తర్వాత కాలంలో కూడ కొందరు భక్తులందరు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొన సాగించేవారు. ఒక పాత సినిమాలో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది. ''తిరుపతి వెంకటేశ్వరా దొరా నివె దిక్కని నమ్మినామురా..... కాలి నడక మారిపోయి కార్ల వసతి కలిగింది.... వచ్చి పోయె వారికెల్ల వనరు బాగ కుదిరింది.... బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పడింది..... తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా......''
ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు
చేస్తారు.
పంక్తి 33:
ఏర్పాట్లు చేసి వున్నారు.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారం లో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం.
 
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు