ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
==నేపథ్యం==
 
బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]]లలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.
ఆంధ్ర రాష్ట్రృ ఉద్యమం
ప్రభుత్వాలు ప్రజలు మాట్లాడే భాషలో నడుస్తూంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దృఢమైన సత్సంబంధాలేర్పడతాయి.తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలన్న భావనలోనుండే తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలన్నది వచ్చింది. మరి ప్రాంతాల విభజన ఎలా జరగాలి అన్నప్పుడు ప్రజలు మాట్లాడే భాషా పరంగా అన్నది ఆచరణ యోగ్యం. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశన్ని తమ పాలనా సౌకర్యాన్ననుసరించీ,విభజించి పాలించాలన్న కుటిలనీతికి అనుగుణంగానూ, ఒకే భాషమాట్లాడే ఒకే జాతిప్రజలను ముక్కచెక్కలుగా చీల్చి వివిధ ప్రాంతాలుగా విభజించారు.
ప్రజల్లో స్వారంత్ర్య కాంక్ష పెరుగుతున్నకొద్దీ భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిద్భావాన్ని కూడా ఆశించడం ఆరంభమైది.1907 లో సూరతో జరిగిన కాంగ్రెసులో స్వరజ్య సాధనే రాజకీయ పరమావధిగా ఉడాలని దాదాభాయి నౌరోజి అన్నాడు.సూరత్ సభలకు కాంగ్రేసు చరిత్రలో ప్రధానస్థానం ఉంది.మితవాధ వర్గాలు ఫిరోజ్ షా మెహతా,సురేంద్రనాథ్ బెనర్జీ.గోఖ్లేల నాయకత్వాన ఉంటూండేవి.మహారాష్ట్రలో తిలక్,పంజాబ్ లో లాలలజపతిరాయ్,బెంగాల్ లో బిపిన్ చంద్రపాల్ తో పాటు వీరులనేకులు అతివాదులుగా స్వరాజ్య నినాదంతో అతివాదులు సమీకృతులయ్యారు.మిరవాదులు సూరత్ కాంగ్రేసు అధ్యక్షుడుగా రాస్ విహారి ఘోష్ పేరును ప్రతిపాదిస్తే,వెంటనే తిలక్ లేచి లజపతిరాయ్ పేరును ప్రత్యామ్నాయంగా సూచించాడు.అప్ప్టివరకూ కాంగ్రెస్సే మోహతా - మోహతాయే కాంగ్రెస్ అన్న భావన ఉండేది.అది బద్దలైంది.ఈ సభలకు మద్రాసు ప్రాంతం నుండి ప్రకాశం వి.కృష్ణస్వామయ్యర్,నటేశన్,దొరస్వామయ్యర్,చక్రయ్యచెట్టి తదితరులు అనేకులు వెళ్ళారు.ఎప్పుడైతే ప్రత్యామ్నాయ సూచన తిలక్ చేసాడో సభలో గందరగోళం -అలజడి చెలరేగింది.సభ్యులు బాహాబాహి,కచాకచీ తలపడ్డారు.కుర్చీలు విసురుకున్నారు.తలలు పగిలాయి.మితవాదులు కంగు తిన్నారు.అతివాదులు పుంజుకున్నారు.అయినా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ మితవాదిల కొద్దిపాటి ప్రభావం కిందే తరువాత లక్నో కాంగ్రెసు దాకా కొనసాగింది.