ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు''' 17వ శతాబ్దం వరకు [[తెలుగు భాష]]లో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో [[ఆంధ్రా యూనివర్సిటీ]], వాల్తేరు ప్రచురించినది.
 
క్రీ.పూ. 200 నుండి. క్రీ.శ. 1700 వరకు ఆంధ్రదేశము నందలి రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వాటి పరిణామములను విశదీకరించే ప్రయత్నమిది. ఇందులో భారతదేశంలో తెలుగు రాజ్యమును స్థాపించిన వల్లభుని అభ్యుదయ కథనము, చోళుల వీరగాథలు, మహోన్నతాంధ్ర సామ్రాజ్య స్థాపకులైన కాకతీయుల చరిత్ర, పలనాటి వీరుల శౌర్య ప్రతాపములు, కాటమరాజు కథ, ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయని సమరౌద్ధత్యము, ఆరవీటి రాజుల చరిత్ర, నాయక రాజుల పాలనము, బసవేశ్వర పండితారాధ్యుల శైవమత ప్రచార సంరంభము, ఓరుగంటి ఆంద్రులఆంధ్రుల సాంఘిక జీవనమును తెలుగు గాథలు మొదలైన విషయాలను విమర్శనాత్మక దృష్టితో కూర్చిన మణిహారమే ఇది.
 
ఈ పుస్తకాన్ని రచయిత తన అమ్మ శ్రీమతి వెంకటరత్నమ్మ మరియు నాన్న శ్రీ బాల సుబ్బారావు గార్లకు భక్తితో అంకితమిచ్చారు.