ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 53:
 
# [[ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ]] - [[యునెస్కో]] (UNESCO) - ఈ సంస్థను 1946 నవంబరు 4 స స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం [[పారిస్]] లో ఉంది. [[విద్య]], [[విజ్ఞానం]], [[సంస్కృతి]] రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన పాలసీల తయారీ కొరకు, అధికార చెలామణి కొరకు, మరియు దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి. (1) సాధారణ సభ (జనరల్ కాన్ఫరెన్సు) (2) కార్యనిర్వాహక బోర్డు (ఎక్సిక్యూటివ్ బోర్డు) (3) మంత్రాలయం (సెక్రటేరియట్) - కార్యనిర్వాహక బోర్డు, సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది. మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని డైరెక్టర్ జనరల్ నాలుగేండ్ల కాల పరిమితికి ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉంటారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల యునెస్కో కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం [[న్యూఢిల్లీ]], [[కైరో]], [[జకార్తా]], [[మాంటెవిడియో]], [[వెనిస్]] లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కోలో 192 దేశాలకు సభ్యత్వం ఉంది.
# [[ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి]] లేదా [[ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి]]- [[యునిసెఫ్]] (UNICEF లేదా UNCF) - 1946 డిసెంబరు 11న ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. ప్రస్తుతం దీని పేరులో "అంతర్జాతీయ ", "అత్యవసర " అనే పేర్లను తొలగించి [[ఐక్య రాజ్య సమితి బాలల నిధి]] అని వ్యవహరిస్తున్నారు. [[అభివృద్ధి చెందుతున్న దేశాలు|అభివృద్ధి చెందుతున్న దేశాల]]లో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం]] - (UNDP) - ఈ సంస్థ 1965 నవంబరు 22న స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి [[సంపద]]ను వృద్ధి చేసుకొనేందుకు అవుసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి [[యు.ఎన్.డి.పి.]] యేటా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం]] - (UNEP) [[స్వీడన్]] రాజధాని [[స్టాక్‌హోమ్]] లో 1972 జూన్ 5 న నిర్వహించిన [[పర్యావరణం|పర్యావరణ]] సదస్సు ఫలితంగా యు.ఎన్.ఇ.పి. రూపుదిద్దుకొంది.
# [[ఆహార మరియు వ్యవసాయ సంస్థ]] - (FAO) - ప్రధాన కార్యాలయం [[రోమ్]] నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న [[కెనడా]] దేశపు నగరం [[క్విబెక్]] లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే యేటా అక్టోబరు 16ను [[ప్రపంచ ఆహార దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిమి, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థలక్ష్యాలు.
# [[అంతర్జాతీయ కార్మిక సంస్థ]] - (ILO) - ఈ సంస్థ కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. 1919 ఏప్రిల్ 11న [[నానా జాతి సమితి]] అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న [[కార్మికులు|కార్మికుల]] [[జీవన ప్రమాణాలు]] స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు [[నోబెల్ శాంతి బహుమతి]] లభించింది.
# [[దస్త్రం:OMS.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]] లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం]] [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] - (WHO) - 1948 ఏప్రిల 7న ఈ సంస్థ ప్రారంభమైంది. దీని కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. ఇంకా అలెగ్జాండ్రియా, బ్రజవిల్లే, కోపెన్ హాగెన్, మనీలా, న్యూఢిల్లీన వాషింగ్టన్ నగరాలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, [[అంటు వ్యాధి|అంటు వ్యాధుల]] నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. [[మలేరియా]], [[క్షయ]], [[మశూచి]] వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. [[ఎయిడ్స్]] వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ]] - (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం [[ఆస్ట్రియా]] దేశపు [[వియన్నా]]లో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
# [[ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్]] - (UNHCR)) - 1951 జనవరి 1నుండి ఈ సంస్థ పని చేయసాగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. శరణార్ధుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో వోబెల్ శాంతి బహుమతి లభించింది.
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు