ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 322:
 
 
అయితే ఒమన్‌లో ఆధునికత, సంప్రదాయం కలగలిసి ఉంటాయి. తక్కిన కొన్ని గల్ఫ్ అరబ్బు దేశాలకంటే ఒమన్ మరింత స్వేచ్ఛాయుత దృక్పధాన్నీ, పరమత సహనాన్నీ ప్రోత్సహిస్తుంది. ఒమన్‌లో స్త్రీలు అన్ని విధాలైన ఉద్యోగాలలోనూ రాణిస్తున్నారు. ఇక్కడ చర్చిలు, [[హిందూ దేవాలయాలు]] ఉన్నాయి. అన్ని మతాల పండుగలు తమతమ పరిధులలో ప్రజలు జరుపుకోవచ్చును. [[అరబ్బీ భాష|అరబిక్ భాష]] అధికారిక భాష అయినా [[ఆంగ్ల భాష]] విరివిగా వాడుతారు.
 
ఒమన్ పౌరుల దుస్తులు: మగవారి దుస్తులను 'డిష్‌డాషా' అంటారు. ఇది పైనుంచి క్రిందివరకు వేళ్ళాడే అంగీ. తలపైన సాంప్రదాయిక సందర్భాలలో పాగా, మిగిలిన సమయాలలో టోపీ ధరిస్తారు. నడుముకు బెల్టులాంటి కట్టులో '[[ఖంజర్]]' ధరిస్తారు. ఖంజర్ అంటే ఒకవిధమైన చురకత్తి. ఆడవారు నల్లని దుస్తులు ధరిస్తారు. తలపై జుట్టు కనిపించకుండా కప్పుకుంటారు. గ్రామీణ స్త్రీలు ముఖం కూడా ముసుగులో కప్పుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు