కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 60:
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానె జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో వున్నది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
 
ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే.... గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుడేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా .... ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుధూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవల నాలుగు రోజులు అదీ మాహోత్సవాల సందర్బంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున వున్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం
 
;ఆలయ చరిత్ర…
పురాణ కథనం ప్రకారం కుమారి కన్యాకుమారి , పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే వుండి పోయాయట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని స్థానికులు చెపుతుంటారుల.
 
;త్రివేణి సంగమం:
పంక్తి 69:
 
;కన్యా కుమారిలో చూడవలసిన ఇతర ఆకర్షణలు:
కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలలో.... ముఖ్యమైనవి 1.వివేకానంద రాక్‌, 2.తిరువళ్లువర్‌ విగ్రహం, 3.గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి.
 
;వివేకానంద రాక్
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల రాతితో స్మారకభవనం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడికి బోటు ద్వారా వెళ్ళవలసి వున్నది.
 
:తరువళ్లువర్‌ విగ్రహం… వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో ఆనాఇ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం ఆసియా లోని ఎతైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు ఇక్కడికి కూడ పడవలలో వెళ్లాల్సిందే.
 
;గాందీ మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో పర్యాటక కేద్రం.... మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ మరణానంతరము... గాంధీజీ అస్తికలను మూడు సముద్రాలు కలిసే చోటనిజ్జనం చేయాలని అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి రోజున అనగా అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా ఈ స్మారకాన్ని నిర్మించారు.
 
మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి భారత దేశానికి దక్షిణాగాన కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడ ప్రసిద్ధి చెందింది. ఒకే ప్రదేశం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఒక ప్రదేశం నూడి చూడగలిగిన మన దేశంలో ఒకే ఒక్క ప్రదేశం కన్యాకుమారి. మరో అరుదైన అద్భుతానికి కూడ ఇది నిలయము. పౌర్ణమి నాడు ఒక వైపు సూర్తాస్తమాన్ని మరో వైపు చంద్రోదయాన్ని కూడ ఇక్కడి నుండి చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి చాల మంది యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు