చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
 
==గ్రామంలోని దేవాలయాలు==
* #మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉన్నది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిధిలావస్తలో ఉన్నది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2]
* #ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
* #మండల పరిధిలోని రాపూరు - తిమ్మాయపాలెం క్రాస్ వద్ద వెలసిన శ్రీ నరసింహస్వామివారి ఆలయం శిధిలావస్థకు చేరుకున్నది. 400 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళే భక్తులు, స్వామివారి పాదాలు దర్శించుకొని, తిరుమలకు వెళ్ళటం ఆనవాయితీ. ఏడుకొండల వెంకటేశ్వరుడి నుండి విడిపోతూ, తొలిసారి పాదం ఇక్కడ పెట్టి, రెండో పాదం పెంచలకోనలో పెట్టినాడని పురాణ గాధ. ఈ నేపథ్యంలో పెంచలకోన క్షేత్రంలో పది రోజులపాటు ఉత్సవాలు, ఎంతో వైభవంగా నిర్వహించెదరు. అయితే స్వామివారి తొలిపాదం ఉన్న ఈ ఆలయం మాత్రం, ఆలనా పాలనా లేక శిధిలావస్థకు చేరుకోవడం, భక్తులకు తీవ్ర ఆవేదనకు గురి చేయుచున్నది. పెంచలకోనకు వెళ్ళలేని భక్తులు ఇకడ స్వామివారి పాదాలచెంత ముడుపులు చెల్లించుకుంటారు. [4]
* #చిట్వేలి మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో మారమ్మ ఆలయం ఉన్నది. [4]
 
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు