అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత హైస్కూలు చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజీలో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]</ref>. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతినుండి ఎం.ఏ.పూర్తి చేసి బందరు హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, లెక్చరర్‌గాను పనిచేశారు. తరువాత కొంతకాలం నందిగామలో ఉద్యోగం చేసి 1972లో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం కాకినాడలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
 
==రచనలు==
1.మధుజ్వాల
2.అంతర్జ్వాల
3.గోదావరి నా ప్రతిబింబం
4.రక్తసంధ్య
5.సంఘంశరణంగచ్ఛామి
6.మెరుపుపువ్వు
7.అయినాధైర్యంగానే
8.పొగచూరిన ఆకాశం
9.శ్రీశ్రీకవితాప్రస్థానం
10.గీటురాయి
11.తెరలు
12.ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ
13.ఆకుపచ్చని సజీవ సముంద్రం నా నేల
==పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)==
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి "చిన్నప్ప" అవార్డుకు ఎంపిక అయింది. "పొగచూరిన ఆకాశం" లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించగలిగారు. అందువల్ల యిది అవార్డు కు ఎంపికయింది. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే అనేక కవితా ప్రతీకలు, పదబంధాలు, కవితాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిబద్ధ జీవితాన్ని నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవిస్తూ ఎంపిక జరిగింది. <ref>[http://www.prabhanews.com/specialstories/article-243820 అంధ్ర ప్రభలో]</ref>