వేములవాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''వేములవాడ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505302. వేములవాడ, కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది.
వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్‌, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతున్నది. వేములవాడలో డిగ్రీస్థాయి వరకు సంస్కృత భాష బోధించబడుతున్నది.
 
అంతే కాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు.
 
అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా కలదు. ఈ ఆలయం లో భక్తులు తమ మొక్కుబడులను (అంటే కోడి , మేక వంటి జంతువులను అమ్మవారికి భలి ఇచ్చి) తీర్చుకుంటారు.
 
==చరిత్ర==
ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన [[ధర్మగుండం]] అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు.
"https://te.wikipedia.org/wiki/వేములవాడ" నుండి వెలికితీశారు