వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివేనని డీఎల్‌ఐ వారు చెప్తున్నా కాదని కొందరు అంటున్న నేపథ్యంలో వీలున్నంతలో మరీ కొత్త పుస్తకాలు ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఐతే మరీ మంచి పుస్తకం, తెలుగు వికీపీడియా అభివృద్ధికి బాగా దోహదపడుతుందనుకున్న పుస్తకం ఐతే ఎప్పుడు ప్రచురణ ఐనా వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వికీపీడియాలో కేవలం లంకెలు ఇచ్చి వివరాలు మాత్రమే ఇస్తున్నాం. నేరుగా పుస్తకాన్ని పెట్టలేదు. కనుక కాపీరైట్ లేని పుస్తకాలు చేర్చినా సమస్యలేని విధంగానే విడివిడి పేజీలుగా డీఎల్‌ఐ వారు పెట్టారు. కాపీరైట్ సమస్య ఉత్పన్నం కాదు. కాకపోతే కాపీరైట్ లేని పుస్తకాలు కాని పక్షంలో వికీపీడియా, విక్షనరీ, వికీకోట్స్‌కు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప వికీసోర్స్‌ను సుసంపన్నం చేసేందుకు పనికిరావు.
* వికీమీడియా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అక్కరకు వచ్చే విజ్ఞానసర్వస్వ సమాచారంతో నిండిన పుస్తకాలే ముందుగా జాబితా చెయ్యండి. చరిత్ర గ్రంథాలు, జీవితచరిత్రలు, వ్యాస సంకలనాలు, ఆత్మకథలు వంటి కాల్పనికేతర సాహిత్యమే విజ్ఞానసర్వస్వ వ్యాసాలు తయారుచేయడానికి పూర్తిస్థాయిలో పనికి వస్తుంది. నవలలు, కథలు, కవితా సంకలనాలు, పద్యకావ్యాలు వంటి కాల్పనిక సాహిత్యం పూర్తిగా విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి పనికిరాదనడం కుదరదు కానీ కొన్ని రకాల వ్యాసాలే అభివృద్ధి చేయడం కుదురుతుంది. ఉదాహరణకు కాకతీయ సంచిక అనే పుస్తకం వల్ల కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ విధానాల గురించి ఎంతో సమాచారం చేర్చగలం. అదే ఏదైనా కాకతీయుల కాలం నాటిని వర్ణించిన చారిత్రిక నవలను అలా ఉపయోగించుకోలేం. కానీ ఇదే అంతటికీ వర్తిస్తుందనుకోవడమూ సరైంది కాదు. తిరుపతి వెంకట కవుల పద్యనాటకాలు, శ్రీనాథుని కావ్యాలు వంటి సుప్రసిద్ధి పొందిన పుస్తకాలను చేర్చడం వల్ల వికీసోర్సు సుసంపన్నమవుతుందని గుర్తుంచుకోవాలి.
== ప్రాజెక్ట్ సభ్యులు ==
 
== మూలాలు ==