ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆస్తాన్-ఎ-షామీరియా''' [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే '''షామీరియా దర్గా''' అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా [[బుగ్గవంక]] ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్. వీరి పూర్వులు పూర్వపు [[రష్యా]] (USSR) కు చెందిన [[బుఖారా]] (ప్రస్తుతము [[ఉజ్బెకిస్తాన్]]లో ఉన్నది) ప్రాంతానికి చెందినవారు. వీరు [[ఆఫ్గనిస్థాన్ఆఫ్ఘానిస్తాన్]] మీదుగా [[భారతదేశం]]లోనికి ప్రవేశించారు. ఇప్పటి [[పాకిస్తాన్]] కు చెందిన [[వుఛ్]] ప్రాంతం నుంచి [[గుల్బర్గా]]కు అటు నుంచి కడపకు వచ్చారు.
 
 
పంక్తి 8:
 
ప్రతి సంవత్సరం [[రంజాన్]] ముందటి [[షాబాన్]] మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. కవిత్వం చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, వైద్యశాలను, ఉచిత ప్రసూతి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని కోరుతున్నారు.
==మూలాలు, వనరులు==
కడప జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు
 
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు