"వెల్లాల" కూర్పుల మధ్య తేడాలు

241 bytes added ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Robot: Removing from వర్గం:కడప జిల్లా పుణ్య క్షేత్రాలు)
సంజీవరాయడు అంటే ఆంజనేయస్వామి. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.
 
గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేశారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ప్రముఖ చలనచిత్ర నటి '''[[వెల్లాల శాంతకుమారి|శాంతకుమారి]]'''ది వెల్లాల గ్రామమే.
 
ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఇక్కడ నిర్మించిన వైద్యశాలలో పేదలకు ఉచిత వైద్యమందుతోంది.
==మూలాలు, వనరులు==
 
కడప జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు
[[వర్గం:కడప జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/123569" నుండి వెలికితీశారు