నందవారికులు: కూర్పుల మధ్య తేడాలు

చి నందనవారికులు, నందవారికులు కు తరలించబడింది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నందనవారికులు''' లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ. [[10వ శతాబ్దము]] లో వారణాసి ప్రాంతములో ఒక పెద్ద కరువు వచ్చి అనేకమంది పండితులు జీవనోపాధి కొరకు దక్షిణ భారతమునకు వలస వచ్చినారు. ప్రస్తుత [[కర్నూలు]] జిల్లా ప్రాంతమును పరిపాలించిన [[నందన చక్రవర్తి]] ఉత్తరాది నుండి వచ్చిన 500 బ్రాహ్మణ కుటుంబములను ఆహ్వానించి వారికి [[బనగానపల్లె]] దగ్గరి [[నందవరము]] గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను. నందవరము పేరు మీదుగా ఈ బ్రాహ్మణులే నందవారికులయ్యెను. ఇప్పటికి వీరు నందవరమును తమ జన్మస్థలముగా భావిస్తారు. ఇక్కడ అన్ని కుటుంబముల వంశ చరిత్రలు భద్రపరచి ఉన్నవి. నందవరములోని చౌడేశ్వరి అను ఒక బ్రాహ్మణ మహిళ యొక్క ప్రభావము తమకు అగ్రహారము దక్కుటకు ముఖ్య కారణమైనందున నందనవారికులు చౌడేశ్వరిని తమ ఇలవేల్పుగా నేటికి పూజిస్తారు. ప్రముఖ వాగ్గేయకారుడు [[అన్నమయ్య]] నందవారికుడే.
 
==పుస్తక మూలములు==
"https://te.wikipedia.org/wiki/నందవారికులు" నుండి వెలికితీశారు