ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేక పోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు.
అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో చాలా విశేషాలతో పాటు, ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషిచేశాడు.
 
ఆర్యభట్టుడాతని గ్రంధాలలో శాలివాహన శతకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే చెప్పేడు.అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే ఈతను జన్మించివుంటాడు.[[వరాహమిహిరుడు]] తనగ్రంధాల్లో శకభూపాలకాలమని, శకేంద్రకాలమని ఉపయోగించాడు.ఇదే విక్రమాదిత్యకాలమని [[భట్టోత్పలు]] డన్నాడు. [[భాస్కరుడు]] కూడా తన సిద్ధాంత గ్రంధాల్లో శాకనృపసమయమని ఉపయోగించాడు.ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు.ఈరెండు శకాలు వాడుకలోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం.కాని ఇవి రెండు వాడుకలోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు.ఆర్యభట్టుడు [[బ్రహ్మగుప్తుడు]] కి పూర్వుడు.అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు.వరాహమిగహిరునికి కన్నా పూర్వుడని అనేక అధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంధాలు [[శ్రీసేనుడు]] [[రోమక సిద్ధాంతం]] మీదా, [[విష్ణుచంద్రుడు]] [[వశిష్ట సిద్ధాంతం]] మీదా అధారపడి ఉన్నాయి. ఈరెండు సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతలను ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుదు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాట మనం నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో ఆరవసతాబ్దానికి చెందినవాడు. వరాహమిహిరులు ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఈదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకుకూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈవిషయాలన్నీ పరిశీలిస్తే, ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహనశకం ఐదవ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును.ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీ.శ.426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంధాన్ని క్రీ.శ.499లో వ్రాసాడని చెప్పవచ్చును.
 
ఆర్యభట్టుడు ఎప్పుడూకూడా ఆకాశంవైపు చూస్తూ కంటికికనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాలవలన ఫలితాలకి గల వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవునిగూర్చి తపస్సుచేసేడట. దానిఫలితమే '''దశ గీతిక''' అనేచిన్న గ్రంధం. ఈయన ఆర్యభట్టీయమనే గ్రంధంలోని భాగాలు రెండు-దశాగీతిక, ఆర్యాష్టోత్తరశతకము.ఈదశగీతికలో పదమూడు శ్లోకాలున్నాయి.ఇవన్నీ వ్యకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డావి. ఈగ్రంధంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చిపెట్టాడు.గణితపాదం, కాలక్రియపాదం, గోలార్ధ ప్రకాశిక అనేవి మూడు ఆర్యాష్టోత్తరశతకంలో ప్రకరణాలు.ఆర్యభట్టుని గ్రంధాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతిప్రకాశిక వ్రాసిన [[సూర్యదేవదీక్షితుడు]], కేరళకు చెందిన [[నీలకంఠసోమయాజి]].
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు