వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 24వ వారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Mayabazar.jpg|150px|right]]
అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిపోయిన చిత్రం, '''[[మాయాబజార్]]'''. ఈ చిత్రము [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర దేశ]]మంతటా [[1957]], [[మార్చి 27]]వ తేదిన విడుదలై అద్భుత విజయం సాధించింది. [[2007]] మార్చి నాటికి 50 ఏండ్లు పూర్తి చేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలిజన్ ప్రసార వాహిణులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.
[[షావుకారు]], [[పాతాళభైరవి]], [[మిస్సమ్మ]], [[జగదేకవీరుని కథ]], [[గుండమ్మ కథ]] వంటి జనరంజక చిత్రాలను నిర్మించిన [[విజయా సంస్థ]] తెలుగు సినీ ప్రేక్షకులకు అందించిన మరొక అపురూప కళాఖండం ఇది. [[భక్త పోతన]], [[యోగి వేమన]], [[గుణసుందరి కథ]], [[పాతాళ భైరవిపాతాళభైరవి]], [[దొంగరాముడు]] మొదలగు చిత్రాలను రూపొందించిన [[కె వి రెడ్డి]] ఈ చిత్రానికి కూడా దర్శకుడు.
 
ఇదే కథతో [[1936]] సంవత్సరంలో [[మాయా బజార్ (1936 సినిమా)|శశిరేఖా పరిణయం]] పేరుతో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి ''మాయాబజార్'' అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. [[మాయాబజార్|పూర్తివ్యాసం]] : [[Wikipedia:విశేష వ్యాసాలు |పాతవి]]