అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==రామరాయల కుట్రలు==
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగ సాగింది. రామరాయలు తమ్ములు వెంకటాద్రి, తిరుమలులు అండగా ఉన్నారు. [[కందనవోలు]], [[అనంతపూరు]], [[ఆలూరు]], [[అవుకు]] దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి [[ఇబ్రహీం ఆదిల్‌షా]] గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులని రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.<ref>ఎన్.వెంకటరమణయ్య (1935) పేజీ.59</ref>
 
1536లో [[గుత్తి]] ప్రాంతములోని తిరుగుబాటును అణచి [[తిరుమల]]ను దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. ప్రజలకుకృష్ణదేవరాయల భార్యలు తిరుమలాదేవి, సామంతులకుచిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించుట ఇష్టంఇష్టపడలేదు. లేదుపట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా రాయరాయల పట్టాభిషేకం జరగలేదు<ref>ఎన్.వెంకటరమణయ్య (1935) పేజీ.60</ref>. [[మధుర]], [[కొచ్చిన్]] ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి అచ్యుతరాయల్ని బందీ నుండి విడిపించి సింహాసనముపై పునరుద్ధరించారు.
 
రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్‌షా [[నాగలాపురం|నాగలపురాన్ని]] నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్‌షా ప్రతిపక్షములో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు కానీ రామరాయలు కానీ ఆదిల్‌షాను ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్‌షా సహాయము అర్ధించి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్‌షా పై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితి గమనించి అచ్యుత, రామరాయల మధ్య సమాధానం కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు