ప్రతాపరుద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
=== కాల్పనిక సాహిత్యం ===
నాటకాలు, కావ్యాలు, చారిత్రిక నవలలు వంటి వాటిలో ప్రతాప రుద్రుని గురించి ఎన్నో ప్రస్తావనలు రావడమే కాక కొన్ని రచనల్లో ప్రతాప రుద్రుని పోరాటాలు, వీరత్వం, దురదృష్టకరమైన ఓటమి, మరణం వంటివే ఇతివృత్తాలు. వీటిలో కొన్ని చారిత్రికపరమైన వివరాలను కాకుండా కాల్పనికాంశాలకు పెద్దపీట వేసినవీ ఉన్నాయి.
* '''[[ప్రతాపరుద్రీయం]]''': కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ప్రతాప రుద్రుని జీవితంలో కొన్ని జరిగిన ఘటనలు ఆధారంగా చేసుకుని ప్రముఖ పండితుడు [[వేదము వేంకటరాయ శాస్త్రి]] రచించిన నాటకం ఇది. ఈ నాటకంలోని ఇతివృత్తం ప్రకారం ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు. ఇతడు మహామేధావి, గొప్ప రాజభక్తి కలవాడు. ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్. అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి, తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ, దానికి ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ చెబుతాడు. కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి, ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో వస్తాడు. అప్పుడు మంత్రులు, రాజు నగరంలో లేడని, ఒక వారంలో వస్తాడని చెబుతారు. ఇంతలో వలీఖాన్ తన రహస్య అనుచరులతో, వేటకు వెళ్ళిన ప్రతాపరుద్రుని బంధించి,ఢిల్లీ సుల్తాన్ వద్దకు తీసుకొనిపోతాడు. విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకొన్న మంత్రి యుగంధరుడు, పేరిగాడనే వానికి మారువేషం వేయించి, ప్రతాపరుద్రుని స్థానంలో, ఢిల్లీ సుల్తాన్ రాజదర్బారులో ప్రవేశపెట్టి, వలీఖాన్ ఆట కట్టించి, ఢిల్లీ సుల్తాన్ ద్వారా అతనికి శిక్ష వేయించి, నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. అలా తన అచంచలమైన రాజభక్తిని చాటుకొంటాడు మంత్రి యుగంధరుడు. ఈ కథకూ చారిత్రిక యధార్థాలకు పొంతన లేకున్నా పాత్రలు చాలా వరకూ చారిత్రికాలే.<ref>సంగ్రహ ప్రతాపరుద్రీయ నాటకము (రంగప్రతి), వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1992</ref>
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రతాపరుద్రుడు" నుండి వెలికితీశారు