నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
== రచన నేపథ్యం ==
టంగుటూరి ప్రకాశం పంతులు తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు. ఈ ఆత్మకథలోని మూడువంతుల భాగాన్ని ప్రకాశం రాయగా, ఆయన పనులవత్తిడి, ఆపైన అనారోగ్యంతో మరణం పొందడంతో మిగిలిన భాగాన్ని ప్రకాశం అనుంగు శిష్యుడు [[తెన్నేటి విశ్వనాథం]] వ్రాసి పూర్తిచేశారు.
 
తర్వాత 1972 సంవత్సరంలో [[ఎమెస్కో]] బుక్స్ వారు నాలుగు భాగాల్ని ఒకటిగా చేసి ముద్రించారు.
 
== జీవిత విశేషాలు ==
పేద కుటుంబంలో జన్మించి అత్యంత కష్టభాజనమైన జీవితాన్ని బారిస్టరు చదువు వరకూ నడిపించిన ప్రకాశం 20వ దశకం తొలినాళ్లలో మద్రాసులో విపరీతంగా డబ్బు, పేరు సంపాదించిన న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. తన వృత్తి శిఖరాయమానంగా ఉండగా ఆ రోజుల్లోనే లక్షాధికారియైనా గాంధీ పిలుపునందుకుని దేశం కోసం వృత్తిని, ఆపైన స్వరాజ్య పత్రికను నిర్వహించడంలో సమస్త సంపదనూ త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ చరిత్ర ఆయన పేరు లేకుండా సాగదు.
"https://te.wikipedia.org/wiki/నా_జీవిత_యాత్ర" నుండి వెలికితీశారు