మంజరీ మధుకరీయము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.
 
జు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,
అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మంజరీ_మధుకరీయము" నుండి వెలికితీశారు