కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
స్వాతంత్ర్యానంతరం ,కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు.అలా [[మద్రాసు]] కర్ణాటక సంగీత కేంద్ర బిందువుగా వెలసింది.
ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది. ప్రతీ యేటా చెన్నై లో డిసెంబరు మరియు జనవరి మధ్యలో జరిగే కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలలనుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు.
 
== గ్రంధాలు ==
మనకు లభ్యమగు ప్రాచీన సంగీతశాస్త్ర గ్రంధములు స్వల్పములయ్యు వాని వలన ఆకాలపు సంగీతమునుగూర్చి కొంత తెలుసుకొనుటకు వీలు కలదు. సంగీత వాజ్మయమునకు ఆది గ్రంధముగా పేర్కొనబడు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి భరతముని విరచిత '''నాట్య శాస్త్రము''' , తరువాతి క్రీ.శ.12100-1247 ప్రాంతమునాటి శారంగదేవుని '''సంగీతరత్నాకరము''' స్వతంత్ర గ్రంధములుగ తెలియబడుచున్నవి. ఈకాలము వరకు దత్తిల, కోహాల, నందికేశ్వర, మతంగ, కశ్యప, యక్షటిక, అభినవగుప్త, మాతృగుప్త, శంకుక, రుద్రట, నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, ముమ్మట, కీర్తిధర మొదలగు సంగీతవేత్తలు భరత నాట్యమును పురస్కరించుకొని వ్యాఖ్యానములు, గ్రంధములను రచించిరి. అంతేకాక తమ గ్రంధములను భరతాంకితముగ వెలయుచుండిరి. నాన్య భూపాలుడు తన గ్రంధమును '''భరతభాష్య''' మనెను.నందికేశ్వరుని '''భరతావర్ణవము''', అభినవగుప్తుని '''అభినవభారతి''' మున్నగునవి ఇట్టివే. కోహలుని '''సంగీతమేరు''', మాతంగుని '''బృహద్దేశి''', దత్తిలుని '''దత్తిలము''', భట్టగోపాలుని '''తాళదీపిక''', శారదాతనయుని '''భావప్రకాశము''' భోజదేవుని '''సరస్వతీకంఠాభరణము''', పార్స్వదేవుని '''సంగీతసమయసారము''' మున్నగు కొన్ని గ్రంధములు స్వతంత్రములుగ రాయబడినను అవిభరతగ్రంధమున గల వివిధ విషయములలో నాట్యకళకు సంబంధిచిన కొన్ని విషయములను ముఖ్యముగ అలంకార రసాదులను, విపుల పరిచించినారు. పెక్కు గ్రంధములు నాట్యకళ పరమావధిని గూర్చి, అనగా రసమును గూర్చి మగ్నతతో చెప్పినారు.ఎట్లైనను భరతనాట్యశాస్త్రానుగత సంగతులను అనేకములుగ జేసి చెప్పుటవలన అవి '''సంగీతరత్నాకరము''' కాలమువరకు అంతగ స్వతంత్ర గ్రంధములుగ తెలియలేదు. లొల్లట, ఉద్భట, శంకుక, కీర్తిధర, అభినవగుప్త ఆచార్యాదుల గ్రంధములు నాట్య శాస్త్రమునకు వ్యాఖ్యానములు. కావున 13వ శతాబ్దమువరకు గల సంగీత గ్రంధములు భ్రతనాట్యశాస్త్రమునకు సంబందిచినవే అని చెప్పుకోవచ్చును. కాని వీటిలో సంగీతమునకు సంబందించిన విషయములు ఉండుటవల వీటిని సంగీతమును అభ్యసించువారు చదువెడివారు.
 
=== సంగీత రత్నాకరము ===
శారంగదేవునివలన రచింపబడిన '''[[సంగీత రత్నాకరము]]''' మీద పెక్కువ్యాఖ్యానములున్నవి, వానిలో ఆంధ్ర కృతములు జనసమ్మతము లగుచుండెననియు తెలియుచున్నది. అట్టి ఆంధ్రవ్యాఖ్యాతలలో ముఖ్యులు చతురకల్లినాధుడు, సిమ్హభూపాలుడు, కుంభకర్ణ భూమీశుకుడు మున్నగువారు. ఒప్పర్టుదొరగారు తమ సంస్కృత వ్రాత గ్రంధములో '''సంగీతరత్నాకరచంద్రికా'' అను వ్యాఖ్యానమును చెప్పెను. గ్రంధకర్తపేరు తెలియదు. కేశవ అను బ్రాహ్మణుడు మరియొక వ్యాఖ్యానమును రచించినట్లు '''సంగీతసుధ''' యందు తెలియుచున్నది. ఇది ఇప్పటి మద్రాసు గ్రంధాలయమునందు ఉన్నది.
 
=== రాగార్ణవము ===
క్రీ.శ. 1609వ సంవత్సరమున ఆంధ్రభారతాచార్యుడగు సోమనార్యుడు రచించిన '''రాగవిబోధా'' యందీగ్రధముగూర్చి తెలియుదును. 14వ శతాబ్దము మధ్యమున రచింపబడిన '''సారంగధరపద్ధతీ'' అను గ్రంధమునకు ఈ రాగార్ణవము తోడగుచున్నట్లు అందు తెలియుచున్నది. గ్రంధ కర్త తెలియరాకపోయినను ఈగ్రంధము ఆంధ్రవాగ్గేయకరులచే ఆదరింపబడినది.
 
=== హరిపాలదేవుని సంగీత సుధాకరము ===
 
ఈ గ్రంధము మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయమునను, తంజావూరు గ్రంధాలయమునను కలదు. గ్రంధకర్త అయిన హరిపాలదేవుడు భూపాలకుడని గ్రహింతుము. చాళుక్య రాజులలో హరిపాలుడు అనుపేరుగలవాడు కలడని, ఈ గ్రంధకర్త ఆయనేయుండునని కొందరు ఎంచిరి. ఈయన శ్రీరంగ క్షేత్రమున పోయి అక్కడ నటీనటులకు వారికోరికపై సంగీతము ఏర్పరచినట్లు గ్రంధమున కలదు. వారిచెప్పిన మతము సంగీతసుధాకర గ్రంధముననుసరించిననియు దెలిపినాడు.
 
=== శారదాతనయ ===
శారదాతనయ '''భావప్రకాశము''' అను గ్రంధము నాట్యకళ గూర్చియు, శారదీయము అనునది సంగీతము గూర్చియు రచించెను. ఇతడు బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. భావప్రకాశ గ్రంధము మైసూరు ప్రాంతమందలి మేల్ కోట రాజువద్ద నొకప్రతియు, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంధాలయమున ఒక ప్రతియు కలదు.
 
=== విద్యారణ్యుల సంగీతసారము ===
[[విద్యారణ్యుడు]] ఈయన ఆంధ్ర బ్రహ్మణుడు.ఈయన సంస్కృత వాజ్మయమునకు మిగుల తోడై పెక్కు శాస్త్రములందు గ్రంధములను వ్రాసినాడు.ఈయన కర్ణాటక సంగీతము అంకురింపజేసే ననుటకు రాగములను మేళకర్తల గా క్రోడీకరించు పద్దతిని తెలియజేసినాడు. ఈయన చెప్పిన మేళకర్త పద్దతియే కర్ణాటక సంగీతమును ఉత్తరదేశపు సంగీతమునుండి వేరుచేయుచున్నది. ఉత్తరదేశమున [[రాగ రాగిణి]] అను పద్దతి అమలో ఉండెను. విద్యారణ్యులిట్లు మేళపద్దతి నేర్పరచి ఆంధ్రుల ప్రతిభను చాటినాడు. విద్యారణులు వ్రాసిన సంగీతసార ఇప్పుదు అలభ్యము. బికనీరు గ్రంధాలయమున ఈపేరు గల గ్రంధము ఒకటి కలదు. కాని అది క్రీ.శ. 1565 లేక 1506 కాలమునాటిదని దెలియుటచే అది విద్యారణ్యులు వ్రాసినది కాదని తెలియుచున్నది.
 
 
== ప్రధాన అంశాలు ==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు