బాసర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
|footnotes =
}}
'''బాసర''', ([http://www.wikimapia.org/#lat=18.8627576&lon=77.9534912&z=12&l=19&m=a&v=2 Basara]) [[తెలంగాణ]]లో [[ఆదిలాబాదు]] జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు [[ముధోల్]] మండలానికి చెందిన గ్రామము. బాసర, [[నిజామాబాదు]] పట్టణానికి 35 కి.మీ దూరంలో [[గోదావరి]] నది ఒడ్డున ఉంది. [[హైదరాబాదు|హైదరాబాదుకు]] సుమారు 200 కి.మీ. దూరం. బాసర [[సరస్వతి]] అమ్మవారి క్షేత్రము. [[భారత్|భారత దేశం]]లో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి [[కాశ్మీరు|కాశ్మీరులో]] ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన [[సరస్వతి]] అమ్మవారు [[మహాలక్ష్మి]], [[మహాకాళి]] సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత [[సరస్వతి]] అమ్మవారు. భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతిదేవి ఆలయాలలో ఇది ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్ము కాశ్మీర్ లో ఉన్నది. హిందూ మతం ప్రకారం జ్ఞానంను ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం నందు అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు.
 
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/బాసర" నుండి వెలికితీశారు