ఇంగ్మార్ బెర్గ్మాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
“The Devil’s Eye (1960)” ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. “The chastity of a woman is a sty in the eye of the devil” అన్న వాక్యంతో మొదలవుతుంది కథనం. నరకంలో సైతానుకి కంటి మీద ఒక కురుపు వస్తుంది. దానికి కారణం భూమ్మీద ఉన్న ఒక అమాయకపు కన్య అని తీర్మానిస్తారు అతని సలహాదారులు. ఆ కురుపు పోవాలంటే ఆమెని ఆకర్షించి, ప్రేమలో పడవేసి, ఆమె కన్యత్వాన్ని అపహరించడమే పరిష్కారం అంటారు. దీనివల్ల, సైతాను డాన్ యువాన్ అన్న ఒక నరకలోక వాసిని పిలుస్తాడు. అతగాడు ఇదివరలో భూమ్మీద బ్రతికున్నప్పుడు వందలకొద్దీ అమ్మాయిలను తన మాయలో పడవేసిన చరిత్ర కలవాడు. ఇలా ప్రతి ఒక్కర్నీ ప్రేమలో ముంచి మోసం చేయడమే కానీ, నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వాడు. చివరికి అలాగ “ప్రేమలో” పడ్డ ఒక అమ్మాయి తండ్రి తాలూకా విగ్రహం ఇతనితో చేయి కలిపినట్లే కలిపి, నరకంలోకి లాగేస్తుంది. సరే, అతగాడు సైతాను చెప్పింది విని ఒప్పుకొని భూమ్మీదకు వెళ్లి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తాడు. అతగాడు తన ప్రయత్నంలో సఫలమయ్యాడా? పాపం సైతాను కురుపు తగ్గుముఖం పట్టిందా? అతని బాధ తీరిందా? అన్నది తదుపరి కథ.
 
Persona(1966) ఇందులో కథ, ఒక నటి ఉన్నట్లుండి మనుష్యుల్తో మాట్లాడటం మానేస్తుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. ఆమెని చూస్కోడానికి హాస్పిటల్లో ఓ నర్సుని నియమిస్తారు. నటికి స్థాన మార్పు కోసం వీళ్ళిద్దరూ అక్కడి డాక్టర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. ఉండేది ఇద్దరే కనుక, ఏమీ తోచక నర్సు నటితో తన కథ చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె అన్నింటికీ తల ఊపుతుంది తప్పితే ఏమీ మాట్లాడదు. కాలం గడిచేకొద్దీ నర్సు ప్రవర్తన మార్పు చెందుతూ వస్తుంది. ఎవరు ఎవరి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అన్న సందేహం వస్తుంది. ఈ సినిమాలో ఉన్న విశేషం, కేవలం రెండు పాత్రలే ఉంటాయి. అందులోనూ కెవలం ఒక్క పాత్ర మాత్రమే మాట్లాడుతుంది. పైగా సైకో టైపు. కానీ, ఈ సినిమాలో కథ, ఆ పాత్రధారుల హావభావాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రాసినది బెర్గ్మానే. కథే కాస్త క్లిష్టమైనది. దాన్ని సినిమాగా తీయగలగడం అన్నదే ఈ సినిమా దర్శకత్వంలోని గొప్పదనం.
 
Wild Strawberries (1957) ఈ సినిమాలో ఓ వృద్ధ ప్రొఫెసర్ తనకి ఓ యూనివర్సిటీ ఇస్తున్న గౌరవ డాక్టరేటు తీసుకోవడానికి తన కోడలితో సహా వెళ్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో అతన్ని జ్ఞాపకాలు, కలలూ, మరణం గురించిన చింతా – చుట్టుముడతాయి. దారిలో అతను కలిసిన మనుష్యులూ, అతని ఆలోచనల్లో ఒక్కో పాత్ర ప్రవేశం తెచ్చిన మార్పులూ – ఇదీ కథాంశం.
 
Fanny and Alexander (1982): కథ విషయానికొస్తే ఇది ఫానీ, అలెగ్జాండర్ అన్న ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోవడం, వాళ్ళ తల్లి రెండో పెళ్ళి చేసుకోవడం, ఆ సవతి తండ్రి చేతుల్లో ఈ తల్లీ పిల్లల పాట్లు – ఈ నేపథ్యంలో సాగుతుంది కథ. చివరకి సుఖాంతమే. కథ ఇదైనా, ఇందులో చాలా అంశాలు ప్రస్తావిస్తాడు బెర్గ్మాన్. మతం, దేవుడు, ప్రేమ, ద్వేషం, మధ్యలో ఆత్మలూ, దయ్యాలూ, కాస్త తాత్విక చింతనా – ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తాడు బెర్గ్మాన్. అలెగ్జాండర్ ఆత్మతో సంభాషిస్తూ ఉండే సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి నాకు. ఈ సినిమా నిడివి పరంగా కాస్తంత పెద్దదే అయినా కూడా ఎన్నో విషయాలు.
 
=='''రచనలు'''==