స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 23:
==మహాత్మాగాంధీ మరియు అలీ సోదరుల అఖిల భారత పర్యటన ==
 
భారతదేశ పర్యటనలో భాగంగా, ఖిలాఫత్‌ ఉద్యమ ప్రముఖులైన ఆలీ సోదరులతో కలిసి గాంధీజీ ఆంధ్రకు వచ్చారు. చరిత్ర సృష్టించిన ఈ పర్యటన విజయవాడ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్ముడు 1920 జనవరి 1న జరిగిన సభలో ప్రసంగిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం అందజేసిన బిరుదులను త్యజించాలని, పదవులను వదులుకోవాలని కోరారు. ఆ పిలుపుకు విజయవాడకు చెందిన [[జాగీర్దార్‌ మహమ్మద్‌ముహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌మొహియుద్దీన్‌ సాహెబ్‌]] తక్షణమే స్పందించారు. ఆయన నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి తక్షణమే రాజీనామా చేశారు. ఆ విధంగా గాంధీజీ పిలుపుకు స్పందించి ప్రభుత్వ పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడిగా గులాం మొహిద్దీన్‌ ఖ్యాతిగాంచారు. గాంధీజీ పిలుపు మేరకు, ప్రభుత్వ పదవులు దిగతుడుపుగా భావించిన మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ స్ఫూర్తితో, మద్రాసు అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖాజీ అహ్మదుల్లా, ఖాన్‌ సాహెబ్‌, అన్వర్‌ జమాఖాన్‌ సాహెబ్‌, అబ్దుల్‌ మజీద్‌ తదితర ప్రముఖులు ఎన్నికలను బహిష్కరిస్తూ తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. రాయలసీమ యోధుడు యం. షంషీర్‌ బేగ్‌ తన చదువుకు స్వస్తి పలికి విశ్వవిద్యాలయాన్ని వదిలి వచ్చేశారు. 1921లో బెజవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. అన్నివర్గాల ప్రజలు పాల్గొని పండగలా జరుపుకున్న ఈ సమావేశాలలో [[మహాత్మాగాంధీ]], ఇతర జాతీయ నాయకులతో పాటుగా అబ్బాస్‌ తయ్యాబ్జీ, [[హాకీంహకీం అజ్మల్‌ఖాన్‌అజ్మల్ ఖాన్‌]], [[మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌]], [[మహమ్మద్‌ముహమ్మద్‌ అలీ]], [[షౌకత్‌ అలీ]], [[ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్]] లాంటి ముస్లిం ప్రముఖులు విచ్చేశారు. ఆంధ్ర నాయకులు క్రియాశీల పాత్ర వహించిన ఈ సమావేశాలలో స్థానిక నాయకుడు షఫీ అహమ్మద్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఈ సమావేశాల నిర్వహణకు విజయవాడకు చెందిన జాగీద్దార్‌జాగీర్దార్‌ మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేశారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రసాదించిన పదవులు, బిరుదులు వదులుకోమని, సంపూర్ణ సహాయ నిరాకరణ పాటించమని జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపును అందుకుని ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందిన మౌల్వీ జహిద్‌జాహిద్‌ హసన్‌ సాహెబ్‌, జమాల్‌ మొహిద్దీన్‌ సాహెబ్‌, షంషుల్‌ ఉలేమా, ఖాన్‌ సాహెబ్‌ ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించిన పలు గౌరవ బిరుదులను, పదవులను తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. గుంటూరుకు చెందిన మౌల్వీ మహమ్మద్‌ రజాఖాన్‌ బెల్గామి ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. ఆయన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మండల ఖిలాఫత్‌ సంఘానికి అధ్యక్షత వహించారు. [[ఖిలాఫత్‌ కమిటీ]] ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా హిందూపురం మేజిస్ట్రేట్‌ ముహమ్మద్‌ హుస్సేన్‌ సాహెబ్‌, నబీ సాహెబ్‌ బహదూర్‌, టిప్పూ ఖాన్‌ తమ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించారు. ఆదోనికి చెందిన రోషన్‌ ముల్లా 1920 జూన్‌లో ఆదోని మున్సిపాలిటీ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ఇటువంటి త్యాగాలు అసంఖ్యాకంగా సాగాయి. అధికార అనధికార పదవులలో ఉన్నవారంతా తమ హోదాలకు, పదవులకు, ఆంగ్ల ప్రభుత్వ మెహర్బానికి సామూహికంగా రాజీనామాలు సమర్పించారు. కర్నూలుకు చెందిన న్యాయవాది సయ్యద్‌ సాబ్‌ మొహిద్దీన్‌ ఖాద్రి బియబాని వేలాది రూపాయల సంపాదనను ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని వదిలేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌లచే ప్రభావితులైన ఆయన జీవితాంతం జాతీయవాదిగా, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగిన పోరాటంలో సయ్యద్‌ సాబ్‌ మొహిద్దీన్‌ ఖాద్రి బియబాని భాగస్వామ్యం వహించడం మాత్రమే కాదు జాతీయోద్యమానకి తన 500 ఎకరాల భూమిని దానం చేశారు. గాంధీజీ పిలుపునందుకుని న్యాయవాద వృత్తిని వదులుకున్న వారిలో విజయవాడకు చెందిన జనాబ్‌ అలీ బేగ్‌ మరొకరు. అలీబేగ్‌ ఆనాటి రాజకీయాలలో ప్రముఖ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు సేవలందించారు. 1921 ఏప్రిల్‌లో మద్రాసులో మహాత్మాగాంధీ పాల్గొంటున్న సభలో వలియుల్లా బాద్షా సాహెబ్‌, నాదర్‌ సాహెబ్‌ తదితర ప్రముఖులు పాల్గొని ప్రజలను ఉద్యమించమని ప్రోత్సహిస్తూ ఉద్వేగంగా ప్రసంగాలు చేశారు.ఈ సందర్భంగా ఖిలాఫత్‌-సత్యాగ్రహోద్యమాల ప్రాముఖ్యతను వివరిస్తూ, హిందూ-ముస్లింల ఐక్యత ఎంత అవసరమో ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రముఖులుగా ఖ్యాతి గాంచిన అలీ సోదరులలో ఒకరైన మౌలానా ముహమ్మద్‌ అలీతో కలసి మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 1921 సెప్టెంబరు 13న కలకత్తా నుండి రైలులో విశాఖపట్నం వచ్చారు. ఆ ప్రముఖులు విశాఖపట్నం చేరగానే పోలీసులు ముహమ్మద్‌ అలీని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ప్రజలలో ఆగ్రహావేశాలను రగిల్చింది. ఆ సమయంలో అలీని అరెస్టు చేసినందుకు విశాఖపట్నం యోధుడు రజాక్‌ ఎంతో ఆందోళన చెందారు, ఆగ్రహించారు. పోలీసులు ముందుకు సాగకుండా ఆయన అడ్డుపడ్డారు. అలీని పోలీసుల తీసుకెళ్లకుండా అటంకపర్చి అల్లరి లేవదీశారు. ఆ సమయంలో మౌలాను అరెస్టు చేసినందుకు ...విచారం కలిగితే స్వదేశీ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా సూచిస్తూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని మహాత్ముడు కోరారు. (దేశ స్వాతంత్య్రోద్యమంలో విశాఖ జిల్లా స్థానం, విశాఖజిల్లా దర్శిని, విశాఖపట్నం, 2002 మరియు ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ : కొడాలి ఆంజనేయులు) ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలలో పెల్లుబికిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమం స్పూర్తిదాయకంగా నిలచింది. ఈ ఉద్యమ ప్రేరణతో దేశ వ్యాప్తంగా పలు స్థానిక ఉద్యమాలు ఉనికిలోకి వచ్చాయి. బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే ప్రధాన చోదక శక్తిగా ఈ ఉద్యమాలు ఉదృతంగా సాగాయి. ఈవిధంగా చరిత్ర సృష్టించిన పలు ఉద్యమాలకు తెలుగుగడ్డ ఆనాడు పుట్టినిల్లయ్యింది. భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల తరువాత ఆంధ్రలో సహాయ నిరాకరణ ఉద్యమం కాస్తా శాసనోల్లంఘన ఉద్యమంగా మారింది. ప్రజలు అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించారు, చట్టాలను ఉల్లంఘించారు. పన్నులు కట్ట నిరాకరించారు. అధికారిక కార్యక్రమాలకు సహకారం అందించకుండా సహాయ నిరాకరణ కొనసాగించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాతంలో కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పుల్లరి ఉద్యమం సాగింది. చీరాల ప్రాంతంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో చీరాల- పేరాల ఉద్యమం ఉధృతమైంది. పర్వతనేని వీరయ్య చౌదరి మార్గదర్శకత్వంలో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కింది. అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం తిరుగుబాటు ఆంధ్రులకు జాతీయ స్థాయిలో ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఈ ఉద్యమాలన్నిటిలో కూడా ముస్లిం యోధులు పాల్గొని తమదైన ప్రత్యేక చరిత్రకు కారకులయ్యారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సాగిన పుల్లరి ఉద్యమంలో సాటి ముస్లిమేతర సోదరులతోపాటుగా ముస్లింలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అవసరాలు, అవస్థలు ఒక్కటే అయినప్పుడు కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమిస్తారనడానికి పల్నాటి పుల్లరి ఉద్యమం నిదర్శనంగా నిలచింది. భారత జాతీయ కాంగ్రెస్‌ గుంటూరు జిల్లా నాయకులు పుల్లరి ఉద్యమం సందర్భంగా కార్యక్రమాలలో పాల్గొని అరెస్టులకు గురికాక ముందుగానే మాచెర్లకు పొరుగు గ్రామమైన కొత్తపల్లికి చెందిన ముగ్గురు ఉద్యమకారులు పుల్లరి చెల్లింపును వ్యతిరేకిస్తూ, సహాయనిరాకరణ ఉద్యమానికి తోడ్పడుతూ, పుల్లరి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో భాగంగా ఉద్యమకారులకు అనుకూలంగా నబీ సాహెబ్‌, చింతపల్లి హుస్సేన్‌ సాహెబ్‌, జానహమ్మద్‌ వ్యవహరించి మొట్టమొదటి సారిగా అరెస్టులకు గురయ్యారని గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు గ్రంథంలో ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు మాదల వీరభద్రరావు పేర్కొన్నారు.
 
==చీరాల పేరాల ఉద్యమ కాలం ==