ఆంధ్రుల సాంఘిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
'''ఆంధ్రుల సాంఘిక చరిత్ర''' గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత [[సురవరం ప్రతాపరెడ్డి]] సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
== రచన నేపథ్యం ==
దీన్ని 1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని అనేక ముద్రణల తరువాత విశాలాంధ్ర తిరిగి ముద్రించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికి ఇచ్చింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చింది. అనేక భారతీయ భాషల లోకి ఇది అనువాదమైంది. దీనిని సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, హైదరాబాదు వారు 1982 సంవత్సరంలో మూడవసారి 2000 కాపీలు ముద్రించారు.<br />
ఆంధ్రుల సాంఘిక జీవన చరిత్ర రచనలో ఇదే మొదటి గ్రంథంగా పేర్కొంటున్నారు. ఐతే ప్రతాపరెడ్డి గ్రంథానికి ముందుమాటలో తనకు పూర్వమే ఈ విషయాన్ని భావన చేసి అలాంటి ప్రయత్నాలు చేసినవారి పేర్లు ప్రస్తావించరు.
 
==బయటి లింకులు==