ఉప్పులూరి గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్పులూరి గణపతి శాస్త్రి''' ప్రముఖ వేదపండితుడు. ఆయన మూలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. హైదరాబాదులో నివాసమున్నాడు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయనకు ''వేదభాష్య విశారద'', ''వేదభాష్యాంలంకార'',''సాంగ వేదార్థ వాచస్పతి'',''వేదభాష్యాచార్య'',''ఆమ్నాయ సరస్వతి'', ''కళాసరస్వతి'' అనే బిరుదులు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు అనే సంస్థ ఉంది. వంశపారంపర్యంగా ఆయనకు పిఠాపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసుని పదవి దక్కడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆస్థాన వేదపండితునిగా ఆయనను నియమించుకున్నాయి.
 
[[ఖండవల్లి లక్ష్మీరంజనం]] ఆధ్వర్యంలో తయారయిన సంగ్రహాంధ్ర విజ్ఞానకోశములో యజుర్వేదానికి సంబంధించిన సమాచారాన్ని ఉప్పులూరి గణపతి శాస్త్రి అందించాడు.
 
[[పి.వి.ఆర్.కె ప్రసాద్]] [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఓ సారి అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. అప్పుడు ఆయన గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో [[వరుణయాగం]] జరిపించడంతో [[తిరుమల]]లో వర్షం పడింది.<ref>నాహం కర్త: హరి కర్త: - పి.వి.ఆర్.కె. ప్రసాద్ అనుభవాలు</ref>