ఇంగ్మార్ బెర్గ్మాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = Ingmar Bergman
| image = Ingmar Bergman Smultronstallet.jpg
| image_size = 250px
| caption = Bergman during production<br> of ''[[Wild Strawberries (film)|Wild Strawberries]]'' (1957)
| birth_name = Ernst Ingmar Bergman
| other_namess = Buntel Eriksson
| birth_date = {{Birth date|df=yes|1918|7|14}}
| birth_place = [[Uppsala]], [[Sweden]]
| death_date = {{Death date and age|df=yes|2007|7|30|1918|7|14}}
| death_place = [[Fårö]], Sweden
| occupation = Film director, producer, screenwriter
| years_active = 1944–2005
| spouse = {{unbulleted list |[[Else Fisher]] {{small|(1943–45)}} |Ellen Lundström {{small|(1945–50)}} |Gun Grut {{small|(1951–59)}} |[[Käbi Laretei]] {{small|(1959–69)}} |{{nowrap|[[Ingrid von Rosen]] {{small|(1971–95)}}}}}}
| awards = {{unbulleted list |[[Goethe Prize]] |[[Praemium Imperiale]]}}
| signature = Ingmar Bergman Signature.png
| signature_size = 200px
}}
 
ఇంగ్మార్ బెర్గ్మాన్ (14 జూలై 1918 - 30 జూలై 2007) ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. ఇతని సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి.ఎందరినో ప్రభావితం చేశాయి. దాదాపు 60 సినిమాలు మరియు టెలివిజన్ డాక్యుమెంటరీలకి దర్శకత్వం వహించాడు. అతని ప్రసిధ్ధి చెందిన సినిమాలు. The Seventh Seal (1957), Wild Strawberries (1957), Persona (1966), Cries and Whispers (1972), and Fanny and Alexander (1982). ప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్ బెర్గ్‌మన్! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్. మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.
 
Line 15 ⟶ 34:
మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్‌మన్. హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే పరిమితమవడానికి కారణం, లాభనష్టాలు బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడు. వింటర్ లైట్, సెవెన్త్ సీల్, వైల్డ్ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్ అండ్ విస్పర్స్, మెజీషియన్, సెలైన్స్, ఫ్యానీ అండ్ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్!
 
“The Devil’s Eye (1960)” ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. “The chastity of a woman is a sty in the eye of the devil” అన్న వాక్యంతో మొదలవుతుంది కథనం. నరకంలో సైతానుకి కంటి మీద ఒక కురుపు వస్తుంది. దానికి కారణం భూమ్మీద ఉన్న ఒక అమాయకపు కన్య అని తీర్మానిస్తారు అతని సలహాదారులు. ఆ కురుపు పోవాలంటే ఆమెని ఆకర్షించి, ప్రేమలో పడవేసి, ఆమె కన్యత్వాన్ని అపహరించడమే పరిష్కారం అంటారు. దీనివల్ల, సైతాను డాన్ యువాన్ అన్న ఒక నరకలోక వాసిని పిలుస్తాడు. అతగాడు ఇదివరలో భూమ్మీద బ్రతికున్నప్పుడు వందలకొద్దీ అమ్మాయిలను తన మాయలో పడవేసిన చరిత్ర కలవాడు. ఇలా ప్రతి ఒక్కర్నీ ప్రేమలో ముంచి మోసం చేయడమే కానీ, నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వాడు. చివరికి అలాగ “ప్రేమలో” పడ్డ ఒక అమ్మాయి తండ్రి తాలూకా విగ్రహం ఇతనితో చేయి కలిపినట్లే కలిపి, నరకంలోకి లాగేస్తుంది. సరే, అతగాడు సైతాను చెప్పింది విని ఒప్పుకొని భూమ్మీదకు వెళ్లి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తాడు. అతగాడు తన ప్రయత్నంలో సఫలమయ్యాడా? పాపం సైతాను కురుపు తగ్గుముఖం పట్టిందా? అతని బాధ తీరిందా? అన్నది తదుపరి కథ.
 
Persona(1966) ఇందులో కథ, ఒక నటి ఉన్నట్లుండి మనుష్యుల్తో మాట్లాడటం మానేస్తుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. ఆమెని చూస్కోడానికి హాస్పిటల్లో ఓ నర్సుని నియమిస్తారు. నటికి స్థాన మార్పు కోసం వీళ్ళిద్దరూ అక్కడి డాక్టర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. ఉండేది ఇద్దరే కనుక, ఏమీ తోచక నర్సు నటితో తన కథ చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె అన్నింటికీ తల ఊపుతుంది తప్పితే ఏమీ మాట్లాడదు. కాలం గడిచేకొద్దీ నర్సు ప్రవర్తన మార్పు చెందుతూ వస్తుంది. ఎవరు ఎవరి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అన్న సందేహం వస్తుంది. ఈ సినిమాలో ఉన్న విశేషం, కేవలం రెండు పాత్రలే ఉంటాయి. అందులోనూ కెవలం ఒక్క పాత్ర మాత్రమే మాట్లాడుతుంది. పైగా సైకో టైపు. కానీ, ఈ సినిమాలో కథ, ఆ పాత్రధారుల హావభావాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కథ కాస్త క్లిష్టమైనది. దాన్ని సినిమాగా తీయగలగడం అన్నదే ఈ సినిమా దర్శకత్వంలోని గొప్పదనం.
 
Wild Strawberries (1957) ఈ సినిమాలో ఓ వృద్ధ ప్రొఫెసర్ తనకి ఓ యూనివర్సిటీ ఇస్తున్న గౌరవ డాక్టరేటు తీసుకోవడానికి తన కోడలితో సహా వెళ్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో అతన్ని జ్ఞాపకాలు, కలలూ, మరణం గురించిన చింతా – చుట్టుముడతాయి. దారిలో అతను కలిసిన మనుష్యులూ, అతని ఆలోచనల్లో ఒక్కో పాత్ర ప్రవేశం తెచ్చిన మార్పులూ – ఇదీ కథాంశం.
 
Fanny and Alexander (1982): కథ విషయానికొస్తే ఇది ఫానీ, అలెగ్జాండర్ అన్న ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోవడం, వాళ్ళ తల్లి రెండో పెళ్ళి చేసుకోవడం, ఆ సవతి తండ్రి చేతుల్లో ఈ తల్లీ పిల్లల పాట్లు – ఈ నేపథ్యంలో సాగుతుంది. చివరికి సుఖాంతమయ్యే ఈ సినిమాలో ఇంకా చాలా అంశాలు ప్రస్తావిస్తాడు బెర్గ్మాన్. మతం, దేవుడు, ప్రేమ, ద్వేషం, మధ్యలో ఆత్మలూ, దయ్యాలూ, కాస్త తాత్విక చింతనా – ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తాడు. అలెగ్జాండర్ ఆత్మతో సంభాషిస్తూ ఉండే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
 
=='''రచనలు'''==
 
అయితే, బెర్గ్మాన్ ఒక దర్శకుడే కాదు. రచయిత కూడా. తన సినిమాలు, వాటి తాలూకా స్క్రీన్ ప్లేలు కాకుండా అనేక నాటకాలు కూడా వ్రాశాడు. సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్‌మన్ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు.
 
=='''అవార్డులు'''==
 
=='''మరణం'''==