నందమూరి లక్ష్మీపార్వతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
లక్ష్మీపార్వతి''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి [[నందమూరి తారక రామారావు]] రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.
10 అగస్తు 1962న జన్మించింది.
తెలుగులో రచయిత మరియు [[తెలుగుదేశం పార్టీ]] అభిమానురాలైన లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర వ్రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. పట్టుదలతో ప్రయత్నించి రామారావు నుండి జీవితచరిత్ర వ్రాయటానికి అనుమతి సంపాదించి 1987లో రామారావు ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది.<ref>http://timesofindia.indiatimes.com/articleshow/2000062697.cms</ref> లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవితచరిత్రను వ్రాసే సమయంలో రామారావుకు సన్నిహితమై 1993లో వివాహం చేసుకున్నది.
 
ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు [[వీరగంధం సుబ్బారావు]]తో ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. ఈమె మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా [[నరసరావుపేట]] కోర్టులో [[విడాకులు]] తీసుకున్నది.<ref>http://www.deccanpost.in/view_news.php?type=ts&nid=4406&cid=1&sid=1</ref> 1993, సెప్టెంబరు 10న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి [[వివాహం]] జరిగింది. [[ఎన్టీ రామారావు]] మరణానంతరము ఆయన జీవితచరిత్రను "ఎదురులేని మనిషి" అన్న పేరుతో 2004లో విడుదలచేసింది.