వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
<!-- సాంగర్ జన్మస్థానం -->వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్‌వ్యూలో జన్మించిన లారీ సాంగర్ తన ఏడేళ్ళ వయసులో అలాస్కాలోని ఆంకరేజ్‌కి కుటుంబంతో సహా తరలివెళ్ళారు. లారీ సాంగర్ ఎదిగే వయసులోనే విద్యలో రాణించాడు. చిన్న వయసు నుండి తత్వశాస్త్రం అంటే మక్కువ పెంచుకున్నాడు. చిన్నతనంలో లారీ సాంగర్ ను ఒకాయన "తత్వశాస్త్రంతో నువ్వేమి చేస్తావు ?" అని అడిగాడట. అందుకు సాంగర్ బదులిస్తూ "ప్రపంచం ఒకే విషయం గురించి ఆలోచించేలా మార్గాన్ని మారుస్తాను" అంటూ బదులిచ్చాడని ఆంకరేజ్‌ డైలీ పత్రికలో ఆలెన్ బ్రాస్ రాసాడు. ఆ చిన్నప్పటి మాట నిజజీవితంలో నిజం చేసాడు. వికీపీడియా స్థాపనకు తోడ్పడి ప్రపంచపు ఆలోచనా మార్గాన్ని మార్చివేసి సంచలనం సృష్టించాడు.
1986 లో స్కూల్ పట్టా పుచ్చుకున్న సాంగర్ ఆ తరువాత తత్వశాస్త్ర అధ్యయనం కోసం కళాశాల ప్రవేశం చేసాడు. కళాశాల విద్యార్ధిగా సాంగర్ విజ్ఞానమూలాలను శోధించడం మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలోనే అంతర్జాలం దాని ప్రచురణ సౌకర్యాల విషయంలో కుతూహలం పెంచుకున్నాడు. ఈ కుతూహలం ఆయనకు ఎన్‌సైక్లోపీడియా కొరకు వికీపీడియాను ఉపయోగించే మార్గం అన్వేషించడానికి తోడ్పడింది. ఆయన మొదటి ప్రయత్నంలో ఒక సర్వరును స్థాపించి దానిలో విద్యార్ధులను ఉపాధ్యాయులను అనుసంధానం చేసి నిపుణుల నుండి విద్యార్ధులు విద్యను నేర్చుకోవడానికి సౌకర్యం కలిగించాడు. విద్యాబోధనా విధివిధానాలు అంతర్జాలం ద్వారా అందే మార్గాలను అన్వేషిస్తూ చర్చల పరంపర కొనసాగించాడు. 1991లో సాంగర్ రీడ్ కాలేజ్ నుండి తత్వశాస్త్రంలో బాచిలర్ డిగ్రీనీ, 1995లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి అందుకున్నాడు. తరువాత అదే యూనివర్శిటీ నుంచి 2000లో డాక్టరేట్ పట్టా పొందాడు. సరిగ్గా అదే కాలంలో "సాంగర్స్ రివ్యూ ఆఫ్ వై2కె రిపోర్ట్ " అనే అంతర్జాల వేదిక (వెబ్‌సైట్) ను నిర్వహించాడు. వీక్షకులకు ఇది వై2కె మూలాధారంగా ఉపకరించింది. అంతర్జాలం ద్వారా పరిచయమైన స్త్రీతో సాంగర్ వివాహం 2001లో జరిగింది. సాంగర్ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాంగర్ జిమ్మీ వేల్స్ తో చేతులు కలిపి న్యూపీడియా సంపాదకుడుగా పనిచేయడం ఆయనను వికీపీడియా వైపు అడుగులు వేయించింది.
 
==గణాంకాలు ==
* వికీపీడియా మొదటిసారిగా ఆంగ్లభాషలో ఆరంభించారు.
* వికీపీడియాలో మొదటిసారిగా ఆరంభించిన వార్త " హలో వరల్డ్ ".
* మొదటి వ్యాసం రూపుదుద్దుకున్న తేదీ 2001 జనవరి 16, ప్రారంభించిన సమయం 21.08 (యు.టి.సి).
* న్యూపీడియా దిద్దుబాటుదారులకు సందేశాలు పంపడం ద్వారా ఆరంభదశలో దిద్దుబాటుదారుల చేరిక సాధ్యమైంది.
* వీక్షకుల రాక గూగుల్ ద్వారా ఆరంభం అయింది.
* ప్రస్తుతం వికీపీడియా 285 భాషలలో ఉన్నది.
* 1,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 16.
* 1,000 వ్యాసాలు పూర్తిచేసుకున్న భాషలు 145.
* అధిక సంఖ్యలో వ్యాసాలు కలిగిన మొదటి ఐదు భాషలు - ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్, డచ్చి, పోలిష్.
* 2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది.
* అలాగే 2006 నాటికి తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
=== [[2014]] గణాంకాలు ===
* ప్రస్తుతం వికీపీడియా 287 భాషలలో ఉన్నది.
* 10,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 12.
* 1,00,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 40.
* 10,000 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 74
* 1,000 వ్యాసాలు పూర్తిచేసుకున్న భాషలు 102.
* 100 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 48.
* 10 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 4.
* 1 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 5
* 0 వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 1
=== అంతర్జాతీయంగా మొత్తం గణాంకాలు ===
* మొత్తం వ్యాసాలు 32 532 793
* మొత్తం పేజీలు 119 154 439
* మొత్తం దిద్దుబాట్లు 1 865 036 506
* మొత్తం నిర్వాహకులు 4 265
* మొత్తం వాడకం దార్లు 47 259 484
* మొత్తం బొమ్మలు 2 270 698
 
== విస్తరణ ==