"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

చి
(Script) File renamed: File:Mahabharat05ramauoft 0086.jpgFile:Srikrishna solace distressed Yudhistira.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable name...
చి ((Script) File renamed: File:Mahabharata04ramauoft 1428.jpgFile:Vyasa talking with Gandhari.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, accordin...)
చి ((Script) File renamed: File:Mahabharat05ramauoft 0086.jpgFile:Srikrishna solace distressed Yudhistira.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable name...)
 
=== శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట ===
[[File:Mahabharat05ramauoftSrikrishna 0086solace distressed Yudhistira.jpg|thumb|left|బాధపడుతున్న ధృతరాష్టుడిని ఓదారుస్తున్న కృష్ణుడు]]
[[ధృతరాష్ట్రుడు]] సిగ్గుతో తలవంచుకున్నాడు. తనవంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి [[కృష్ణుడు]] " ధృతరాష్ట్ర మహారాజా ! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, [[భీష్ముడు]], [[ద్రోణుడు]], [[విదురుడు]], మహామునులు నీకు పరి పరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా ! అది నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు. జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని నీ కోడలు అయిన [[ద్రౌపది]]ని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని [[భీముడు]] నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా ధర్మమా ! నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు " అని హితవు పలికాడు. [[ధృతరాష్ట్రుడు]] " కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను " అని పలికి. తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.
 
36

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1269342" నుండి వెలికితీశారు